Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

అంగన్వాడీలో బల్లి పడ్డ ఆహారం….

పలువురికి అస్వస్థత..

 

కల్లూరు ఫిబ్రవరి 15 ( నిజం న్యూస్ ):

 

మండల పరిధిలోని కృష్ణయ్య బంజర గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో బల్లిపడిన ఆహారం తిని ఇద్దరు చిన్నారులతోపాటు ఇద్దరు వంట మనుషులు అస్వస్థతకు గురయ్యారు.

అంగన్వాడి కేంద్రంలో అన్నం తిన్న ఆరేళ్ల గౌతం,నాలుగేళ్ల పావన స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.వారితో పాటు వంట మనిషి చిన్ని కృష్ణ,ఆయ అంకిలు సైతం అదే ఆహారం తినటం తో విపరీతమైన కడుపునొప్పి రావడంతో హుటాహుటిన కల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

అన్నంలో బల్లి పడిన విషయాన్ని గమనించని సిబ్బంది పిల్లలకు ఆహారం అందించి ఆ తరువాత వారు తినే సమయంలో అన్నంలో ఉన్న బల్లిని గమనించారు.

అప్పటికే చిన్నారులు కడుపులో నెప్పితో బాధపడుతూ ఉండటంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

చిన్నారుల ఆరోగ్యం నిలకడగా ఉందని ప్రమాదం ఏమి లేదని వైద్యురాలు తెలిపారు.అయితే హాస్పటల్ లో చికిత్స పొందుతున్న చిన్నారులను ఎమ్మెల్యే మట్టా రాగమయి ఫోన్ లో పరామర్శించారు.