Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

త్వరలో స్క్రీన్ పై వర్షం……

వింటేజ్ ప్రభాస్ is Back..!!

ఫిబ్రవరి 17న మళ్లీ థియేటర్స్ లో

రెబల్ స్టార్ ప్రభాస్ మరియు త్రిష హీరో హీరోయిన్లు గా నటించిన తెలుగు రొమాంటిక్ అండ్ యాక్షన్ సినిమా సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్ లో ఎమ్మెస్ రాజు నిర్మాతగా శోభన్ దర్శకత్వంలో విడుదలైన సినిమా వర్షం. వర్షం 2004లో విడుదలైనది.

2002లో హీరోగా తెలుగు సినీ పరిశ్రమలోకి మన ముందుకు ఈశ్వర్ సినిమాతో వచ్చాడు. అనుకున్నంత స్థాయిలో ఈశ్వర్ సినిమా ఆడలేదు. ప్రభాస్ కెరియర్ లో హీరోగా తనకంటూ ఒక గుర్తింపును సంపాదించింది వర్షం సినిమా తోటే.

దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి మ్యూజిక్ ని ఈ సినిమాకు అందించారు. వర్షం సినిమా క్రూ సభ్యులు వర్షం సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు.

2024 ఫిబ్రవరి 17న వర్షం సినిమా రి రిలీజ్ కాబోతుంది. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ మన దేశంలోనే కాకుండా చైనా కొరియా జపాన్ వంటి ఇతర దేశాలలో కూడా అభిమానులను సంపాదించారు.

వింటేజ్ రెబల్ స్టార్ ను మళ్లీ స్క్రీన్ పై చూసేందుకు రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతగానో వేచి చూస్తున్నారు.