Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ప్రజలు అపోహలను నమ్మవద్దు

నిజామాబాద్ రూరల్, ఫిబ్రవరి 12, (నిజం చెబుతాం న్యూస్):-
చిన్న పిల్లలను ఎత్తుకెళ్లే ముఠా నిజామాబాద్ జిల్లాలో తిరుగుతున్నారనే అపోహలను ప్రజలు నమ్మవద్దని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ అన్నారు. ఈ మేరకు సోమవారం సీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో కిడ్నాప్ ముఠా తిరుగుతున్నారనే అసత్య వార్తలను విశ్వసించొద్దన్నారు. ఎవరైనా అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.