Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం

చేవెళ్ల, ఫిబ్రవరి 12 (నిజం న్యూస్) :
చేవెళ్ల మండల కేంద్రంలోని భగత్ సింగ్ నగర్‌కు చెందిన సొన్నాయిల శ్రీనివాస్ ఇల్లు సోమవారం విద్యుత్‌ సర్క్యూట్‌తో దగ్ధమైంది. కూలి పనులు చేసుకునే నిరుపేద కుటుంబం, పోషణ కోసం దాచిపెట్టి ఉంచుకున్న ఆహార ధాన్యాలు,నిత్యావసరాల వస్తువులు, ఇంటి సామగ్రి మొత్తం కాలి బూడిదై రోడ్డున పడింది. బాధితుని భార్య సొన్నాయిల రాధిక మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రోజూ మాదిరిగానే కుటుంబ సభ్యులు పనికి వెళ్ళిన తర్వాత విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు వ్యాపించాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా ఫైర్ వాహనం వచ్చేలోపే మంటల్లో బట్టలు, సామాగ్రి కాలిపోయాయని బాధిత కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సుమారు లక్షలో నష్టం వాటిల్లిందని, తమ పరిస్థితిని, జరిగిన నష్టాన్ని పరిశీలించి నష్టపరిహారం అందించి ఆదుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు అధికారులను వేడుకున్నారు. ఆర్థిక సహాయం చేయదలచిన వారు 9000706309 కు ఫోన్ పే గాని, గూగుల్ పే గాని చేయగలరని బాధిత కుటుంబ సభ్యులు వేడుకున్నారు.

బాధిత కకుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన నాయకులు
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇల్లు దగ్ధమై నారాశ్రయులైన సొన్నాయిల శ్రీనివాస్ కుటుంబానికి చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జుక్కన్నగారి శ్రీకాంత్ రెడ్డి రూ.20 వేలు, చేవెళ్ల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం పూజర్లు శ్రీకాంత్, శ్రీపాద్ లు రూ.10 వేలు, అదేవిధంగా చేవెళ్ల మాజీ వార్డు మెంబర్ స్వరూప శ్రీనివాస్ రూ.5 వేలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఆపదలో ఉన్న బాధిత కుటుంబానికి వీలైనంత మంది తమవంతు సహకారం అందించాలని సూచించారు.