Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

16 లక్షలు విలువ చేసే గంజాయి పట్టివేత

  • నలుగురు అరెస్ట్
    చేవెళ్ల, ఫిబ్రవరి 12 (నిజం న్యూస్) :గుట్టు చప్పుడు కాకుండా గంజాయిని తరలిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నామని చేవెళ్ల సీఐ లక్ష్మారెడ్డి తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. బడిశాలోని బ్రహ్మాపూర్ నుండి గంజాయిని తీసుకొని మహారాష్ట్రలో అమ్మడం ద్వారా అధిక మొత్తంలో డబ్బు వస్తుందనే ఉద్దేశ్యంతో మహారాష్ట్రకు చెందిన చిత్ర కైలాష్ మోహిత్(35), నవనత్ గణపత్ చౌహాన్(70), మదన్ బాలసాహెబ్ బయాస్(38), రాజేష్ సుభాష్ మోహిత్(15) లు 64 కిలోల గంజాయిని కొనుగోలు చేసి గుర్తు తెలియని లారీలను ఆపుకొని లిఫ్ట్ అడుగుతూ హైదరాబాద్ మీదుగా చేవెళ్లకు వచ్చి, చేవెళ్లలోని శంకర్ పల్లి చౌరస్తా వద్ద వేచి ఉండి, గుర్తు తెలియని లారీ వస్తే ఆపుకొని సంగారెడ్డి మీదుగా మహారాష్ట్రకు వెళ్లాలని ఎదురుచూస్తుండగా, అదేసమయంలో గంజాయిని తరలిస్తున్నట్లు వచ్చిన ముందస్తు నమ్మదగిన సమాచారంతో చేవెళ్ల పోలీసులు మరియు రాజేంద్రనగర్ ఎస్ఓటి సిబ్బంది సంయుక్తంగా వారిని పట్టుకొని తనిఖీలు నిర్వహించగా, వారి వద్ద ఉన్న 32 ప్యాకెట్ల గంజాయిని, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వాటి విలువ రూ.16 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. నిందితులను అరెస్ట్ చేసి వారిపై కేసు నమోదు చేసినట్లు సీఐ లక్ష్మారెడ్డి తెలిపారు. తనిఖీల్లో ఎస్ఐ వీరబ్రహ్మం, హెడ్ కానిస్టేబుల్ శంకర్, కానిస్టేబుల్ రవికుమార్ తదితర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.