Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

గిరిజన సంక్షేమ శాఖలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై స్పెషల్ ఆఫీసర్ తో విచారణ చేపట్టాలి

  • అవినీతి అక్రమ వసూళ్లకు పాల్పడుతు, డ్యూటీల పేరుతో ఉద్యోగులను ఇబ్బంది పెడుతు, ఎస్టీ కార్పొరేషన్, ట్రై కార్, ఈ ఎస్ ఎస్, స్కాలర్షిప్ ల పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న సోమని సర్వీస్ నుండి రిమూవ్ చేయాలి
  • ఆశ్రమ పాఠశాలలో టీచింగ్, నాన్ టీచింగ్, ఏఎన్ఎం పోస్టులను అమ్ముకున్న మరియు అటెండర్ ను సొంత వెహికల్ డ్రైవర్ గా పెట్టుకున్న డిడి నీ వెంటనే సస్పెండ్ చేయాలి

స్టేట్ బ్యూరో శ్రీనివాస్ నాయక్ డిసెంబర్ 12 )నిజం న్యూస్) 12-2-24 న జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో పాల్గొన్న లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు బోడ రమేష్ నాయక్ మహబూబాబాద్ లో ఉన్న గిరిజన సంక్షేమ శాఖ జిల్లా కార్యాలయంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై స్పెషల్ ఆఫీసర్ తో విచారణ చేపట్టాలని అక్రమ వసూళ్లకు పాల్పడి, అవినీతి అక్రమాలు చేస్తు డ్యూటీ ల పేరుతో ఉద్యోగస్తులను ఇబ్బంది పెడుతున్న సోమనిని వెంటనే సర్వీస్ నుండి రిమూవ్ చేయాలని, అదే విధంగా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న అధికారికి సహకరిస్తున్న డీడీని వెంటనే సస్పెండ్ చేయాలని జిల్లా కలెక్టర్ ను కోరారు. ఈ సందర్భంగా బోడ రమేష్ నాయక్ మాట్లాడుతూ గిరిజన సంక్షేమ శాఖలో మాడ డిపార్ట్మెంట్ నుండి వచ్చిన సోమని అవుట్ సోర్సింగ్ లో అటెండర్ ఉద్యోగం చేసుకుంటూ ఈరోజు గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయం పైనే యజమాయిసి చేసి జిల్లా కార్యాలయాన్ని శాసించే విధంగా ఎదగడాన్ని అతనికి సహకరిస్తున్న డీడిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆశ్రమ హాస్టల్ విద్యార్థులకు వచ్చే కాస్మెటిక్స్ మరియు పిల్లలకు వచ్చే ట్రంకు బాక్సులు, బూట్లు, నోట్ బుక్స్ లు, చద్దర్లు, పల్లాలు, గ్లాసులు మొదలైన వాటిని జిల్లా హెడ్ క్వార్టర్ నుండి ప్రతి ఆశ్రమ హాస్టళ్లకు తరలించే విషయంలో తనకు బినామీగా పనిచేస్తున్న ఒక్కటే వాహనాన్ని పిలిపించుకుని దానికి సంబంధిత ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు బిల్లులు పెట్టుకుని మరియు సంబంధిత హాస్టల్ వార్డెన్ దగ్గర కిరాయి డబ్బులు వసూలు చేసుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్నారు. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్, ట్రైకర్ లోన్లు, ఈ ఎస్ ఎస్ స్కీములు వంటి వాటిలలో సంబంధిత బెనిఫిషర్ల నుండి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. విద్యార్థులకు స్కాలర్షిప్ సంబంధించిన డబ్బులు ఎకౌంట్లో జమ కాగానే వారి వద్ద నుండి కూడా వసూళ్లకు పాల్పడుతున్నారు. టీచింగ్, నాన్ టీచింగ్, ఏఎన్ఎం అక్రమంగా అమ్ముకొని డబ్బులు వసూలు చేస్తున్నారు. గత సంవత్సరంలో సెలవు రోజులలో కూడా ఆశ్రమ హాస్టళ్లను తెరిచి హాస్టల్లో చొరబడి మందు, విందు అనే కార్యక్రమంలో హాల్ చల్ చేశారు. కల్పన అనే ఏఎన్ఎం మహిళను ఒక యూనియన్ లో పని చేసినందుకుగాను ఆమెపై కక్ష సాధింపు చర్యలో భాగంగా ఆమె పోస్టును నాన్ లోకల్ ఇచ్చి విధులకు హాజరు కావట్లేదని నాన రకాలుగా ఇబ్బందులు పెట్టి రాత్రులు అని చూడకుండా కూడా ఫోన్లు చేసి ఇబ్బంది పెడుతున్నారు. ఆశ్రమ హాస్టల్లో వచ్చే డ్రెస్ మెటీరియల్ లను తమ ఇష్టానుసారంగా పర్సంటేజ్లు మాట్లాడుకుని వారి ఇంటికి డ్రెస్ మెటీరియల్ పంపించేయడం జరుగుతుంది. హాస్టళ్లకు సంబంధించిన నెలవారీ బిల్లులు చేయడానికి హాస్టల్ వార్డెన్ల దగ్గర 10% డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నారు. జిల్లా కార్యాలయం డిడి అటెండర్ ను తన సొంత వాహనానికి డ్రైవర్ గా వాడుకుంటూ అటెండర్ జీతం ఇచ్చుకుంటున్నాడు. వి ఎస్ లక్ష్మీపురం లో రైతులకు వచ్చిన 9:38 గుంటల భూమికి ఐటిడిఏ డిపార్ట్మెంట్ వారు 5, 73,000 రూపాయలు చెల్లిస్తే అట్టి భూమిని బెనిఫిషర్స్ కు చందకుండా మధ్యవర్తులు అనుభవించడంతో అట్టి భూములను బెనిఫిషర్స్ కు అప్పజెప్పకుండా మధ్యవర్తుల నుండి డబ్బులు తీసుకుని బెనిఫిషర్స్ పైనే కేసులు పెడతామని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ విధంగా దాదాపు తొమ్మిది సంవత్సరాలుగా స్థాన చలనం లేకుండా ఓకే ఆఫీసులో అటెండర్ గా పని చేసుకుంటూ జిల్లా కార్యాలయం పైన యజమాయిసి చేసే విధంగా ఎదగడాన్ని తీవ్రంగా ఖండిస్తూ అవినీతి అక్రమాలను ప్రక్షాళన చేసి స్పెషల్ ఆఫీసర్ తో విచారణ చేపట్టి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న అటెండర్ సోమనీని వెంటనే సర్వీస్ నుండి రిమూవ్ చేయాలని అతనికి సహకరిస్తున్న ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్న డిడి ని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షాన వారీగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టి చివరకు ముట్టడి చేస్తామని హెచ్చరించారు.