Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

గల్లికో బెల్ట్..బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తున్న వైన్ షాపుల యజమానులు

  • పాలు పెరుగు సరఫరా కంటే బెల్ట్ షాపులుకు మద్యం సరఫరా చేస్తున్నారు.
  • బెల్ షాపులకు డోర్ టు డోర్ డెలివరీ చేస్తున్న వైన్ షాపుల వాహనాలు..
  • ఉదయం ఐదు గంటలకే బెల్ట్ షాపులకు మందు తరలిస్తున్న వైన్స్ యజమానులు.
  • బెల్ట్ షాపులలో ప్రీమియం బ్రాండ్లు.
  • 24 గంటలు అందుబాటులో మద్యం.
  • మద్యం దుకాణాలు పక్కనే సిట్టింగులతో రెస్టారెంట్ దాబాలు.

కురవి,నిజంచెపుతాం,ఫిబ్రవరి,12: కురవి మండల పరిధిలోని 3 మద్యం దుకాణాలు ఉండగా బెల్ట్ షాపులు మాత్రం 150 సంఖ్యలో దర్శనమిస్తున్నాయి. ఒకప్పుడు ఎక్కడో అక్కడ వీధి చివర్లో కనిపించే బెల్ట్ షాపులు ప్రస్తుతం దేవాలయ చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ బడితే అక్కడ విచ్చలవిడిగా ఏర్పాటు చేసుకొని మద్యాన్ని విక్రయిస్తున్నారు.ఒకవైపు ప్రభుత్వం బెల్ట్ షాపులపై కోరడా చూపిస్తున్నప్పటికీ ఆయా బెల్టు షాపులు బరితెగించి మద్యం విక్రయాలు చేపడుతున్నట్లు కనిపిస్తున్నాయి.ఇంత జరుగుతున్నప్పటికీ ఎక్సైజ్ శాఖ మాత్రం తమకేం పట్టీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు.మద్యం దుకాణాలలో ఎమ్మార్పీ ధరలకు అమ్మాలి అనే నిబంధన ఉండడంతో అక్రమార్జనకు బెట్టి షాపు షాపులోనే మద్యం ఏరులై పారుతుంది.మద్యం దుకాణాలు దారులు బెల్ట్ షాపుల యజమానుల నుండి పది రూపాయల నుండి 20 రూపాయల వరకు అదనంగా బెట్టి షాపులు మద్యం అందించి సొమ్ము చేసుకోవడం జరుగుతుంది.ఇదే అదనగా చూసుకొని బెల్టు షాపుల యజమానులు ఒక్కో క్వార్టర్ పై 50 రూపాయలు నుండి 70 రూపాయల వరకు సామాన్యుల నుండి వసూలు చేస్తున్నట్టు విమర్శలు ఉన్నాయి.అంతేకాకుండా మధ్య ప్రియులు ఇష్టపడే బ్రాండ్లను రాయల్ స్టాగ్,రాయల్ బ్లూ, (ఐబి) యువత ఎక్కువగా ఇష్టపడే కింగ్ఫిషర్ లైట్ మొత్తాన్ని బెల్ట్ షాప్ లకే పరిమితం చేస్తూ మద్యం ప్రియులను బెల్ట్ షాపుల కు దారి మళ్ళించి అధిక వసూళ్లకు పాల్పడుతూ లక్షల్లో సొమ్ము చేసుకొని గడిస్తున్నారు.మందుబాబులు రోజంతా కూలి పని చేసుకొని సాయంత్రం అయ్యేసరికి మందు అలవాటు ఉన్న సామాన్యులు ఈ రీతిలో జేబులు ఖాళీ చేస్తూ లక్షలు సంపాదిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.ఇంత జరుగుతున్నప్పటికీ సంబంధిత ఎక్సైజ్ శాఖ అధికారులు మాత్రం తమకేమి పట్టినట్టుగా నిద్రిస్తున్నారు…ఇలాగే మద్యం దుకాణాలు మందు బెల్ట్ షాపుల నిర్వాహకులు ఉదయం ఐదు గంటల నుండి క్యూలైన్లో నిలబడి మద్యం కొనుగోలు చేస్తున్నారంటే అతిశయక్తి కాదు..
..బెల్టు షాపుల నిర్వాహకులకు మద్యాన్ని విక్రయిస్తున్న మద్యం దుకాణదారుల మద్యం తాగే మందుబాబులు వెళ్లేసరికి నచ్చిన సరుకు అయిపోయిందని అని చెబుతుండడం కోసమెరుపు ….కేవలం బెల్ట్ షాపుల నిర్వాహకుల కోసమే మద్యం దుకాణాలు ఏర్పాటు చేస్తున్నట్లు తేటతెల్లమవుతుంది.

“మధ్యాహ్నం దుకాణాల పక్కనే సిట్టింగ్లతో రెస్టారెంట్ దాబాలు”

మండలంలోని దేవాలయం వెనక భాగంలోని రెండు మద్యం దుకాణాల పక్కనే పలు ప్రాంతాల్లో సిట్టింగ్లతో కూడిన రెస్టారెంట్ దాబాలు ఏర్పాటు చేసుకొని విక్రయాలు కొనసాగిస్తున్నారు.మద్యం దుకాణా దారులు బెల్ట్ షాపులకు సరఫరా చేస్తూ వస్తున్న లాభాలను పరిగణలోకి తీసుకొని ఇస్తారాజ్యంగా బెల్ట్ షాపులకు తరలిస్తూ సామాన్లను జేబులకు చిల్లులు పొడుస్తున్నారని తెలుస్తోంది.ఇకనైనా సంబంధిత ఎక్సైజ్ శాఖ మద్యం దుకాణాల ఆగడాలని అరికట్టాలి ప్రజా సంఘాలు పరిసర ప్రాంత ప్రజలు ముక్తకంఠంతో కోరుకుంటున్నారు.

అధికారులు నిద్రమత్తు వీడాలి.. 

గ్రామాల్లో అక్రమంగా మద్యం విక్రయాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు చోద్యం చూస్తున్నారు.మద్యానికి బానిసై యువత ఉద్యోగాలకు వెళ్లకపోవడంతో కుటుంబాల్లో ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. మద్యం కోసం ఆయా గ్రామాల బాటపట్టి యువత రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. అధికారులు నిద్రమత్తు వీడి గ్రామాల్లో ఉన్న బెల్టు దుకాణాలను మూసివేయాలి.మద్యానికి బానిస కాకుండా యువతకు ప్రభుత్వం అవగాహన కల్పించాలి.