Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

హుజూర్ నగర్ లో విద్యార్థినిలకు డ్రగ్స్ చాక్లెట్స్..?

– రహస్యంగా అందిస్తున్న యువకులు

-మందలించిన ఉపాధ్యాయురాలు

-పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

-భయంతో స్కూల్ భవనం పైనుంచి దూకిన విద్యార్థిని

– ఆత్మహత్యకు ప్రయత్నించిన మరో విద్యార్థిని

– పోలీస్ స్టేషన్ కు పరిగెత్తుతున్న తల్లిదండ్రులు

-కూపి లాగుతున్న పోలీసులు

హుజూర్ నగర్, ఫిబ్రవరి 12 (నిజం చెపుతాం): హుజూర్నగర్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఒక విద్యార్థినికి మరో విద్యార్థిని ద్వారా ముగ్గురు యువకులు డ్రగ్స్ చాక్లెట్స్ అందించిన సంఘటన సోమవారం జరిగింది.

ఒక విద్యార్థి తో మరో విద్యార్థికి చాక్లెట్ అందిస్తున్న విషయం తెలుసుకున్న ఉపాధ్యాయురాలు విద్యార్థులను మందలించి స్కూల్ పరిసర ప్రాంతాల్లో సదరు యువకుల ప్రవర్తనపై పోలీస్ స్టేషన్ కు తెలియజేయడం జరిగింది.

ఈ విషయంపై పోలీసులు యువకులను మందలించి విద్యార్థులను పోలీస్ స్టేషన్ పిలిపించి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చినట్లు సమాచారం.

స్కూల్లో జరిగిన సంఘటనపై ఆ ఇద్దరు విద్యార్థినిలో ఒకరు మనస్తాపం చెంది రెండు రోజుల క్రితం స్కూల్ భవనంనంపై నుంచి దూకి ఆత్మహత్య ప్రయత్నం చేసినట్టు తెలిసింది.

ఆమెను మొదటగా స్థానిక ప్రభుత్వ ఆస్పటల్ కు తీసుకుపోగా పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడినుంచి సూర్యాపేట ప్రభుత్వహాస్పిటల్ కి తరలించినట్టు తెలిసింది. సదరు విద్యార్థిని కాళ్లు విరిగి, వెన్నుముక భాగం దెబ్బతిని హాస్పిటల్ చికిత్స తీసుకుంటున్నారు. మరో విద్యార్థిని కూడా ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు సమాచారం. ఇట్టి విషయంపై విద్యార్థినిల తల్లిదండ్రులు సదరు యువకులపై చర్య తీసుకోవాలని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది.

ఈ మధ్యకాలంలో మత్తుపదార్థాలను చాక్లెట్ రూపంలో అందిస్తున్నట్లు పోలీసులకు సమాచారం ఉండడంతో పోలీసులు ఆ కోణంలో కేసు పై దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా హుజూర్నగర్ పట్టణంలో విద్యార్థులకు చాకెట్ల పంపిణీ వ్యవహారం త్రీవ్ర చర్చకు దారి తీసింది. మత్తు పదార్థాలకు హుజూర్నగర్ నియోజకవర్గ ప్రాంతం అడ్డాగా ఉందని గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి . ఇప్పటికైనా ప్రభుత్వం మత్తు పదార్థాల సప్లైదారులపై ఉక్కు పాదం మోపాలని ప్రజలు కోరుకుంటున్నారు