Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

డబ్బులు ఉంటేనే సమ్మక్క సారలమ్మ దర్శనం…..

చిన్న మేడారం భక్తులకు కుచ్చుటోపి

•డబ్బులు ఉంటేనే సమ్మక్క సారలమ్మ దర్శనం

•జాతర పేరుతో సొమ్ము చేసుకుంటున్న నిర్వాహకులు

•లక్షలు పలికిన మద్యం,బెల్లం టెండర్లు

రాజాపేట,ఫిబ్రవరి11(నిజంచెపుతాం) మండలంలోని కుర్రారం చిన్న మేడారంలో ఈనెల ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభమయ్యే సమ్మక్క సారలమ్మ జాతరలో సామాన్య భక్తులకు నిర్వాహకులు కుచ్చుటోపి పెడుతున్నారు.

టెండర్ల ద్వారా లక్షల రూపాయలు సొమ్ము చేసుకుని. తల్లుల దర్శనానికి వచ్చే భక్తుల జేబులు గుల్ల చేస్తున్నారు.టెండర్లు దక్కించుకున్న గుత్తేదారులు దర్శనానికి వచ్చే భక్తులకు

రూ 20నుంచి 50 రూపాయలు నిర్ణయించారు. కొబ్బరి చిప్పల నిర్వహణకు రూ. 65000వేలు, లడ్డు పులిహోర అమ్మకం కోసం రూ. 62000 వేలు, మటన్ మరియు చికెన్ షాప్ నిర్వాహకులకు రూ. 90000 వేలు, పేలాలు అమ్ముకోవడానికి రూ 32000 వేలు ఇక మద్యం, బెల్లం టెండర్లలు లోలోపలే జరిగాయి ఎంఆర్పి రేటుపైఎంతైనా అమ్ముకోవచ్చని నిర్వాహకులు గుత్తేదారులకు తెలిపారు.

ఇలా అనేక అక్రమాల ద్వారా నిర్వాహకులులక్షలు సొమ్ము చేసుకుంటున్నారు.ఈ టెండర్ల మాయాజాలంపై అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. నిర్వాహకులు అధికారులు కుమ్మక్కైనట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

మండలంలో జరిగే చల్లూరు,లక్ష్మక్కపల్లి జాతరలో నిర్వాహకులు ఉచితంగా అన్ని ఏర్పాట్లు చేస్తుండగా, ప్రభుత్వం అన్ని శాఖల సమన్వయంతో నిర్వహించే చిన్న మేడారం జాతరలో నిర్వాహకులు భక్తులను నిలువు దోపిడి చేస్తున్నారు.

ఇకనైనా జిల్లా కలెక్టర్, దేవాదాయ శాఖ అధికారులు తక్షణమే స్పందించి సామాన్య భక్తులు ఉచిత దర్శనం కల్పించాలని భక్తులు కోరుతున్నారు.