Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

14 ఏళ్ల తర్వాత మన్మధుడి సరసన మణి….

మళ్లీ ఇలా మన అందరి ముందుకు జంటగా తెరకి ఎక్కబోతున్న అక్కినేని నాగార్జున మరియు ప్రియమణి అది కూడా 14 ఏళ్ల తర్వాత…

రెండు తెలుగు రాష్ట్రాలలో పరిచయమే అవసరం లేని పేరు నటుడు అక్కినేని నాగార్జున. 60 ఏళ్ల వయస్సులోనూ తన గ్లామర్  తో యంగ్ హీరోలకు దీటుగా పోటీ ఇస్తూ ….

మన్మధుడిలా అమ్మాయిల మనసులను కొల్లగొడుతున్నాడు.

శివ మూవీతో మన అందరి ముందుకు వచ్చి గీతాంజలి, అన్నమయ్య , శ్రీరామదాసు, మన్మధుడు, కింగ్, సోగ్గాడే చిన్నినాయన, వంటి ఎన్నో సినిమాలలో నటించి తెలుగు ప్రజల హృదయాలలో తనకంటూ ఒక చోటు సంపాదించుకున్నారు.

2010 లో రగడ మూవీ లో నాగార్జున సరసన నటించిన హీరోయిన్ ప్రియమణి. ఆ సినిమా తెర పై అంతగా ఆడలేదు. అనుకున్న అంత ఆధరణ ప్రేక్షకుల నుండి లభించలేదు.

మళ్లీ 14 ఏళ్ల తర్వాత మన్మధుడి చెంతన హీరోయిన్ గా మళ్లీ జోడీ కట్టబోతుంది.

డెబ్యూ డైరెక్టర్ సుబ్బు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున మరియు ప్రియమణి హీరో హీరోయిన్లుగా ప్రధాన పాత్రలో నటించనున్నారు.

స్క్రీప్ కోర్ట్ డ్రామా గా చిత్రీకరిస్తున్నారు. ఇప్పడు వరకు ఈ  సినిమా కి సంబంధించిన ప్రొడ్యూసర్స్ ఎవరు ఏంటి, షూట్ డేట్స్ అండ్ అప్డేట్స్ వంటి విషయాలు ఇంకా ఏమీ చెప్పడం జరగలేదు.

ఈ సినిమా యొక్క అప్డేట్స్ కోసం సినీ అభిమానులు ఎంతగానో వేచి చూస్తున్నారు.