అశ్వారావుపేట లో నామా “అమ్మ ఆరోగ్యరధం” ప్రారంభం
ప్రజల ఆరోగ్యం కోసం ఖమ్మం ఎం.పి నామా నాగేశ్వరరావు స్వీయ ఖర్చులతో అశ్వారావుపేట కు “అమ్మ ఆరోగ్యరధం” వాహనం సమకూర్చారని తెరాస నియోజక వర్గం నాయకులు జారే ఆదినారాయణ పేర్కొన్నారు.త్వరలో అశ్వారావుపేట కు నామా నాగేశ్వరరావు సొంత నిధుల నుండి కొనుగోలు చేసిన “అంబులెన్స్” కూడా అందుబాటులోకి వస్తుందని తెలిపారు.ప్రస్తుత తాత్కాలిక వాహనం కు “అమ్మ ఆరోగ్యరధం” గా నామకరణం చేసారని వివరించారు.ఈ వాహనం మండలంలో
30 రోజులు అశ్వారావుపేట మండలంలో కరోనా వైరస్ కారక కోవిడ్ – 19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించే వైద్య సిబ్బంది రవాణా కు ఈ ఆరోగ్య రధం వినియోగ పడుతుందని అన్నారు.అక్టోబర్ అశ్వారావుపేట పర్యటన సందర్బంలో స్థానిక వైద్య అధికారిణి డాక్టర్ నీలిమ,ప్రజా ప్రతినిధులు నుండి ఎం.పి “నామా” కు వచ్చిన వినతి మేరకు ఆయన తన సొంత ఖర్చుతో ఆరోగ్య రధం ఏర్పాటు కు హామీ ఇచ్చారు.అందరూ ఆరోగ్యం గా ఉండాలి అని,ఆరోగ్య తెలంగాణ నిర్మాణమే సి.ఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు లక్ష్యం అనే ఆయన పిలుపు లో భాగస్వామి అయిన ఎం.పి నామా అందుకు అనుగుణంగా కృషి చేస్తున్నారని తెలిపారు.అనంతరం మంగళవారం అయిన అమ్మ ఆరోగ్య రధం ను స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రం ప్రధాన వైద్యురాలు డాక్టర్ నీలిమ,అశ్వారావుపేట,గమ్మడివల్లి ప్రాధమిక వైద్యశాలల వైద్యులు డాక్టర్ రాంబాబు,డాక్టర్ హరీష్ లకు అప్పగించారు.
ఈ కార్యక్రమంలో ఎం.పి.పి అద్యక్షులు జల్లిపల్లి శ్రీరాం మూర్తి,ఉపాధ్యక్షులు చిట్టూరి ఫణీంద్ర,జెడ్.పి.టి.సి సభ్యురాలు చిన్నంశెట్టి వరలక్ష్మి,అశ్వారావుపేట సర్పంచ్ అట్టం రమ్య,రైతు సమన్వయ సమితి మండల సమన్వయకర్త జూపల్లి రమేష్,ప్రాధమిక వ్యవసాయ సంఘం నారాయణపురం అధ్యక్షులు నిర్మల పుల్లారావు,తెరాస మండల కార్యదర్శి బండారు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.