Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ప్రజా సమస్యలపై జర్నలిస్టులు దృష్టి పెట్టాలి

– అక్షర సీనియర్స్ ప్రెస్‌క్లబ్ సమావేశంలో వక్తలు*

– నూతన కమిటీ అధ్యక్షులుగా జవ్వాది మురళీకృష్ణ

– ప్రధాన కార్యదర్శిగా పొనగంటి కృష్ణ

చర్ల : జర్నలిస్టులు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి వార్తల ద్వారా వాటిని వెలుగులోకి తీసుకొచ్చి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సీనియర్ జర్నలిస్టులు కొంగురు రమణారావు, దొడ్డా ప్రభుదాస్‌‌లు అన్నారు

శనివారం చర్లలో జరిగిన అక్షర సీనియర్స్ ప్రెస్‌‌క్లబ్ సమావేశంలో వారు పాల్గొని ప్రసంగించారు. జర్నలిజంలో మెలుకువలు నేర్చుకొని తమ వార్తల ద్వారా సమాజానికి మేలు చేయాలన్నారు.

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో కత్తిమీద సాములా జర్నలిస్టులు పనిచేస్తున్నారని, వీరికి ప్రభుత్వం ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని కోరారు.

ప్రెస్‌క్లబ్ కమిటీ జర్నలిస్టుల అభివృద్ధి, సంక్షేమంపై దృష్టిపెట్టి వారి సమస్యల సాధన కోసం కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో 2024-05 సంవత్సరానికి నూతన కమిటీని ఎన్నుకున్నారు.

*అధ్యక్షులుగా జవ్వాది మురళీకృష్ణ*

అక్షర సీనియర్స్ ప్రెస్‌క్లబ్ నూతన కమిటీ ఎన్నిక శనివారం ఏకగ్రీవంగా ఎన్నికైంది. గౌరవ అధ్యక్షులుగా కొంగూరు రమణారావు, దొడ్డా ప్రభుదాస్, గౌరవ సలహాదారుగా పరుచూరి రవీంద్రబాబు,

కమిటీ అధ్యక్షులుగా జవ్వాది మురళీకృష్ణ (HMTV), ప్రధాన కార్యదర్శిగా పొనగంటి కృష్ణ (సాక్షి), ఉపాధ్యక్షులుగా జి. లక్ష్మణ్‌కుమార్, కోడిరెక్కల వెంకటేశ్వర్లు, కోశాధికారిగా దొడ్డి హరినాగవర్మ,

సహాయ కార్యదర్శిలుగా ఎం. వీరాచారి, నర్సింహరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా బి. సందీప్, కన్వినర్‌గా పందిళ్ళపల్లి వెంకటేశ్వర్లు, కార్యవర్గ సభ్యులుగా సుతారి రుషికుమార్, ఎన్. సాగర్, తోటమల్ల గోపాలరావు, జి. సురేష్ ఎన్నికైనారు. నూతన కమిటీ అధ్యక్షుడు జవ్వాది మురళీకృష్ణ ఈ సందర్భంగా మాట్లాడుతూ

జర్నలిస్టుల ఐక్యత, సంక్షేమం, అభివృద్ధి, వారి సమస్యల పరిష్కారం కోసం తనవంతు కృషి చేస్తానని తెలిపారు.

వార్తలు రాయడంలో మెలుకువలు నేర్పడం కోసం సీమియర్ జర్నలిస్టుల సహకారంతో త్వరలో శిక్షణాతరగతులు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

అధికారులు, రాజకీయ నాయకులు, సంఘాల వారు నూతన కమిటీకి సహకరించాలని కోరారు.