Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టుల కొరియర్లు పట్టివేత,

చర్ల SI మరియు స్పెషల్ పార్టీ పోలీసు మరియు 141 (ఏ) సి‌ఆర్‌పి‌ఎఫ్ సిబ్బందితో కలిసి చర్ల పట్టణంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా చర్ల లో గాంధీ బొమ్మ సెంటర్ వద్ద పుసుగుప్పకూ వెళ్లే రహదారి వద్ద అనుమానాస్పదంగా కనిపించిన ఐదుగురు వ్యక్తులను పట్టుకుని విచారించగా వారు చత్తీస్ఘడ్ రాష్ట్రం ప్రాంతానికి చెందిన కోరం జోగా, పొడియం జోగా, బాడిస లక్ష్మా, సోడి లక్మ ,కొర్స సురేశ్ వ్యక్తులుగా తెలిసింది వారు గత నాలుగు సంవత్సరాలుగా నిషేధిత సిపిఐ మావోయిస్టు జేగురుగొండ ఏరియా కమిటీ జగదీష్, నాగమణి అనే మావోయిస్టు సభ్యులకు కొరియర్లు గా మరియు సానుభూతిపరులు గా ఉంటూ లోకల్ మిలీసియా సబ్యులుగా గా పని చేస్తున్నారని తెలిసింది. నిషేధిత సిపిఐ మావోయిస్టు సభ్యు ల ఆదేశాల మేరకు పై ఐదుగురు వ్యక్తులు భద్రాచలం పట్టణం నుండి మావోయిస్టు పార్టీ యూనిఫామ్ క్లాత్ కొనుక్కొని తిరిగి వెళ్తుండగా చర్ల లోని గాంధీ బొమ్మ సెంటర్ నందు చర్ల పోలీసు వారు పై ఐదుగురిని పట్టుకోవడం జరిగింది వీరి వద్ద నుండి 20 మీటర్ల ఆలివ్ గ్రీన్ క్లాత్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నిషేధిత మావోయిస్టు పార్టీ నాయకులు పూర్తిగా అమాయకులైన ఛత్తీస్గఢ్ రాష్ట్ర గిరిజనులను తెలంగాణ ప్రాంతానికి పంపిస్తూ వారితో పార్టీ కి అవసరమైన వస్తు సామాగ్రిని, ప్రేలుడు పదార్దాలను తెప్పించుకుంటూ వారికి అవసరమైన పనులను చేయించుకుంటన్నారు. అదే విధంగా తెలంగాణ మావోయిస్ట్ స్టేట్ కమిటీ మరియు బటాలియన్లు యాక్షన్ టీమ్ లను రెక్కి టీమ్ లను తెలంగాణ లోకి పంపిస్తూ పోలీసు వారి కదలికలను గమనించి పలు హింసాత్మక చర్యలు సృస్టించి ప్రజలని భయాందోళనకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు ఎవరూ కూడా నిషేధిత సి‌పి‌ఐ మావోయిస్టు పార్టీ నాయకులకు సహకరించవద్దని వారికి ఎటువంటి వస్తువులను సరఫరా చేయవద్దని పోలీసుశాఖ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరైన అటువంటి చర్యలకు పాల్పడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని మన్యం టీవీ కు తెలిపారు.