Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

అవినీతి రహిత సమాజ నిర్మాణం కోసం నేను సైతం

ఉమ్మడి అదిలాబాద్ బ్యూరో ఫిబ్రవరి 09 (నిజం చెప్పుతాం)
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాల్లో పెరుగుతున్న అవినీతి అక్రమాలను నిరోధించేందుకు జాతీయ మానవ హక్కుల కమిటీ ద్వారా చేపడుతున్న అవినీతి రహిత సమాజ నిర్మాణం కోసం ఒక్క అడుగు అనే కార్యక్రమంలో భాగంగా తహసీల్దార్ మండల ప్రజా పరిషత్ వ్యవసాయ శాఖ కార్యాలయాల్లో వినతి పత్రం సమర్పించారు
సామాజిక కార్యకర్త సయ్యద్ కలీం మాట్లాడుతూ పారదర్శకత జవాబు దారితనం పెంపొందించే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయడం జరుగుతుందని
ఎన్ హెచ్ ఆర్ సి (ఎన్ హెచ్ ఆర్ సి) జాతీయ జనరల్ సెక్రెటరీ మరియు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య గారి
ఆదేశానుసారం నిర్మల్ జిల్లాలోని నర్సాపుర్ (జి)మండలంలో వినతి పత్రం ఇచ్చి అవినీతి రహిత సమాజ నిర్మాణం కోసం సహకారం అందించాలని కోరారు
ప్రభుత్వ కార్యాలయాల్లో గోడ పత్రాలు అతికించారు
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రచార కార్యదర్శి జమీల్ షా. సీనియర్ ఆక్టివిస్ట్ సుదర్శన్ గౌడ్.తదితరులు పాల్గొన్నారు