Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

డ్యూటీల పేరుతో ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తున్న సోమని

  • జిల్లా గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయ ఉద్యోగి సోమని నీ వెంటనే సర్వీస్ నుండి రిమూవ్ చెయ్యాలి.
  • ప్రభుత్వ పని దినాల్లో రహస్య మీటింగు పెడుతున్న సోమని, సోషల్ మీడియా, వాట్సప్ గ్రూపులు నిర్వర్తిస్తూ అవినీతి అక్రమాలకు  పాల్పడుతున్న ఉద్యోగి సోమనీ
  • జిల్లా గిరిజన సంక్షేమ శాఖలో జరుగుతున్న అవినీతిని అరికట్టాలి.
  • ఇతనిని వెంటనే విధుల నుండి తొలగించాలి.
  • అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న ఉద్యోగులకు అండగా ఉంటున్న జిల్లా అధికారి డిడిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్.
  • లేని పక్షాన దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేస్తాం, కలెక్టర్ ఆఫీస్ ను ముట్టడి చేస్తాం.
  • బోడ రమేష్ నాయక్ జిల్లా అధ్యక్షుడు లంబాడి హక్కుల పోరాట సమితి మహబూబాబాద్ జిల్లా
    మహబూబాబాద్, జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 9,( నిజం చెబుతాo): మహబూబాబాద్ జిల్లా గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో ఆశ్రమ హాస్టల్లలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులను విధులు సక్రమంగా నిర్వహిస్తా లేరనే నేపముతో మహిళా ఉద్యోగులు అని కూడా చూడకుండా నానా రకాలుగా ఇబ్బందులు గురిచేస్తూ ఉన్నారని బోడ రమేష్ నాయ క్ తీవ్రంగా విమర్శించారు, రాత్రి వేళల్లో డ్యూటీ ల పేరుతో ఫోన్లు చేసుకుంటూ ఇబ్బంది పెడుతున్నారని. చిన్న గూడూరు ఆశ్రమ హాస్టల్ లో పనిచేసే కల్పనా అనే మహిళ ఉద్యోగి జిల్లా కార్యాలయంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి ముందు బోరున ఏడ్చుకుంటూ తన బాధను చెప్పుకోవడం జరిగింది అని రమేష్ నాయక్ తెలిపారు. ఆమెకు గతంలో కురివి ఆశ్రమ పాఠశాలలో ఏఎన్ఎమ్ గా విధులు నిర్వహిస్తుండేది. కానీ మధ్యలో ఏఎన్ఎం పోస్టులు ఔట్సోర్సింగ్ పద్ధతిన 34 మందికి రిక్రూట్మెంట్ జరగగా కల్పన అనే మహిళ గతంలో ఒక యూనియన్ కు అధ్యక్షురాలుగా పనిచేసినందుకు ఆమెను ఇబ్బందులకు గురిచేయాలని ఉద్దేశంతో ఆమె ఒక్కదాన్నే చిన్న గూడూరు ఆశ్రమ పాఠశాలకు పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. మిగతా వారందరికీ వారు గతంలో చేసిన పాఠశాలలోనే పోస్టింగ్లు ఇవ్వడం జరిగింది. తనకు ఇద్దరు చిన్న పిల్లలు, భర్తకు కన్ను పోయి పింఛన్ తీసుకుంటున్నాడు, పిల్లలను ఏకశిలా ప్రైవేట్ పాఠశాలల్లో జాయిన్ చేయడం జరిగిందని, పిల్లల చదువు, రాకపోకలు ఇబ్బందిగా ఉందని గతంలో డిడి కి విన్నవించుకున్నది. స్పెషల్ హాస్టల్ లో ఒక ఖాళీ పోస్టు ఉందని తెలుసుకొని అందులో తక్కువ జీతం ఉన్నా కూడా నేను పని చేసుకుంటూ నాపిల్లలనుచదివించుకుంటానని బ్రతిమిలాడిన కూడా కనీసం ఒక మహిళ అని చూడకుండా, ఆమెని ఇబ్బంది పెట్టాలని ఉద్దేశంతోనే నీకు అలర్ట్ చేసిన పాఠశాలలోనే నువ్వు ఉద్యోగం చేయాలని చెప్పి, ఒక నెల తర్వాత ఖాళీగా ఉన్న స్పెషల్ హాస్టల్ పోస్టును డబ్బులకు కక్కుర్తి పడి వేరే వ్యక్తులకు అమ్ముకోవడం జరిగిందని ఆమె ఏడ్చుకుంటూ చెప్పుకున్నారు. డ్యూటీ ల విషయంలో జిల్లా ఐటీడీఏ కార్యాలయంలో అటెండర్ గా పనిచేస్తున్న సోమని అనే ఉద్యోగి నువ్వు సరిగ్గా డ్యూటీ కి వెళ్లడం లేదని రాత్రిళ్ళు అని చూడకుండా ఫోన్లు చేసి నానా రకాలుగా ఇబ్బందులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, ఏఎన్ఎం ఉద్యోగులకు సంబంధంలేని అటెండర్ సోమని ఏఎన్ఎం లకు స్పెషల్ సోషల్ మీడియా వాట్సప్ గ్రూపులు చేసి ఆజమాయిసిచెలయిస్తున్నాడని, సరిగ్గా పని చేయకుంటే డ్యూటీ నుండి తీసివేస్తానని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని, ప్రభుత్వ పని దినాలలో కూడా నిన్న గురువారం 34 మంది ఏఎన్ఎం లను పిలిపించి ఎన్టీఆర్ స్టేడియంలో రహస్య మీటింగ్ పెట్టారని ఆమె తన బాధను వ్యక్తం చేశారు. ఆమె మాట్లాడుతూ, ఈ ఉద్యోగం నాకు లేకున్నా పర్వాలేదు గాని అతని ఆగడాలు తట్టుకోలేక నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బోడ రమేష్ నాయక్ మాట్లాడుతూ, జిల్లా అధికారి ని వివరణ కోరగా ఏదో తూతూ మంత్రంగా తప్పు చేసిన కింది స్థాయి ఉద్యోగులను కాపాడాలని ఉద్దేశంతో సమాధానం చెప్పడాన్ని తీవ్రంగా అసహనం వ్యక్తం చేశారు. గతంలో అదే సోమని అనే ఉద్యోగి చేసిన అవినీతి, అక్రమాలపై జిల్లా అధికారి ని గత కలెక్టర్ ని విన్నవించుకున్న ఫలితం లేకపోయిందని అన్నారు. జిల్లా ఐటీడీఏ డిపార్ట్మెంట్ లలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. హాస్టల్ పిల్లలకు వచ్చే దుప్పట్లు, ట్రంక్ బాక్సులు, బూట్లు, గ్లాసులు, పల్లాలు వీటన్నింటిని హాస్టల్లకు సరఫరా చేసే విషయంలో ఏ ఒక్కరోజు కూడా కూడా జిల్లా అధికారి వెళ్లి పర్యవేక్షణ చేయలేదని, గతంలో ఇచ్చిన ఎస్టీ కార్పొరేషన్ నిధులు కానీ, ఈ ఎస్ ఎస్ లో కూడా అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడని, సోమని అనే ఉద్యోగి పైన కోర్టులో కేసు ఉండంగా కూడా జిల్లా కార్యాలయంలో ఏ విధంగా పని చేపిస్తారని ప్రశ్నించారు. అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ, మహిళా ఉద్యోగుల ఇబ్బందికి గురి చేస్తున్న వారిని వెంటనే సర్వీస్ నుండి రిమూవ్ చేయాలని, అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న ఉద్యోగికి సపోర్ట్ చేస్తున్న జిల్లా డిడి ని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని, కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు భూక్య బాలాజీ నాయక్ మహబూబాబాద్ మండల కార్యదర్శి గోగులోత్ బాలకృష్ణ నాయక్ పాల్గొన్నారు.