Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

వీడీసీ అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు

  • సీపీ కల్మేశ్వర్
    నిజామాబాద్ ప్రతినిధి (నిజం చెబుతాం) ఫిబ్రవరి 08: వీడీసీ అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ వెల్లడించారు. ఇప్పటివరకు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వీడీసీ చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై 28 కేసులు నమోదు కాగా 357 మందిని అరెస్టు చేశారు. ఎవరికైనా వీడీసీ వలన ఎలాంటి ఇబ్బందులు వస్తె వారు తమ దగ్గరలోని పోలీస్ స్టేషన్ అధికారిని సంప్రదించాలని సూచించారు. బహిష్కరణలు చేస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.