Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఈ నెల 16న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి

  • సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి నల్లు సుధాకర్ రెడ్డి
    స్టేట్ బ్యూరో ఫిబ్రవరి 08 (నిజం న్యూస్) కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఉద్యోగ, కార్మిక ,రైతు వ్యతిరేక విధానాలపై ఈ నెల 16న జరిగే సార్వత్రిక సమ్మెలో ప్రతి శ్రమజీవి పాల్గొని జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ల్లు సుధాకర్ రెడ్డి పిలుపునిచ్చారు.
    దంతాలపల్లి మండల కేంద్రంలో జరిగిన సిపిఐ మండల కార్యవర్గ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నల్లు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఆకలి, అనారోగ్యం ,అధిక ధరలు, ఉపాధి లేమితో జనం బాధపడుతుంటే, నిరుపేదల సంఖ్య నాలుగేళ్లలో 19 కోట్ల నుండి 35 కోట్లకు చేరడం, మరోపక్క గత తొమ్మిదేళ్లలో భారత్ లో సృష్టింపబడ్డ సంపదలో 40 శాతం కొద్దిమంది కుబేర్ల దగ్గరకు చేరడం, 50 శాతం మంది ప్రజల దగ్గరకి కేవలం మూడు శాతం సంపద మాత్రమే చేరడం ఈ కేంద్ర ప్రభుత్వ దివాలా కోరు విధానాలకు నిదర్శనమని అన్నారు.
    లాభాల్లో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతూ బరితెగించి ప్రైవేటీకరించడాన్ని ఆపాలని, నాలుగు లేబర్ కోడ్స్ ను, రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని, అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రతా చట్టాన్ని తీసుకురావాలని ,హమాలీ కార్మికులకు సమగ్ర సంక్షేమ చట్టం మరియు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని తదితర డిమాండ్స్ తో అన్ని కార్మిక ఉద్యోగ రైతు సంఘాలు చేపట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఐ మండల కన్వీనర్ పోలేపాక వెంకన్న సోమారపు కృష్ణ సారయ్య వెంకన్న జనార్ధన్ రామ్మూర్తి యాకయ్య తదితరులు పాల్గొన్నారు.