Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

లక్డారం గ్రామంలో కోరలు చాస్తున్న మట్టి మాఫియా..!

  • ప్రశ్నించిన వారిపై దాడులకు దిగుతున్న అక్రమార్కులు..!
  • చోద్యం చూస్తున్న అధికారులు..!
  • పటాన్ చెరు ఫిబ్రవరి 8 (నిజం చెపుతాం) మట్టి మాపియ రెచ్చిపోతుంటే అడ్డుకోవాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినచందంగా వ్యవహరిస్తున్నారు. ఇదెక్కడి దారుణం అంటూ ప్రశ్నించిన గ్రామస్తుల పై దాడులకు సైతం సిద్ధమవుతున్నారు.ఈ తతంగం ఎక్కడో మారుమూల ప్రాంతంలో జరుగుతుంది అంటే ఏమో అనుకోవచ్చు కానీ ఇది సంగారెడ్డి జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న లక్డారం గ్రామం పరిధి సర్వే నంబర్ 747 అనునిత్యం జరుగుతున్న బాగోతం..! వివరాల్లోకి వెళితే పటాన్చెరు మండలం లక్డారం గ్రామంలో మైనింగ్ అక్రమాలపై గత కొద్ది కాలంగా కలెక్టర్,జిల్లా ఎస్పీ సీరియస్ గా ఉన్న విషయం పాఠకులకు విధితమే..!ఇందులో భాగంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశానుసారం స్పెషల్ టాస్క్ ఫోర్స్ కమిటీని వేసి ఒకవైపు విచారణ జరుపుతుంటే మరోవైపు అక్రమ మట్టి వ్యాపారులు చెలరేగిపోతున్నారు. నిత్యం సాయంత్రం ఐదు గంటల నుండి మర్నాడు ఉదయం వరకు పదుల సంఖ్యలో జె.సి.బి లతో వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తూ అక్రమ మట్టి వ్యాపారం చేస్తున్నారు.ఈ వ్యవహారంపై లక్డారం గ్రామానికి చెందిన తుంకి చంద్రశేఖర్ గౌడ్ పటాన్చెరు తాసిల్దార్, పటాన్చెరు సీ.ఐ లకు ఫిర్యాదులు చేస్తే స్పందించడం లేదని ఆయన ఆరోపిస్తున్నారు. ఒకవైపు దాడులు అంటూ హంగామా సృష్టిస్తున్న అధికారులు మట్టి వ్యాపారులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అర్థం కాని వ్యవహారం గా ఉందని అన్నారు..? పోలీసులను సంప్రదిస్తే రెవిన్యూ వారికి ఫిర్యాదు చేయాలని,రెవెన్యూ వారికి ఫిర్యాదు చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఒకరి పైన ఒకరు నెపం నెట్టుకుంటూ సమయం గడుపుతున్నారని మండిపడ్డారు..!ఈ మట్టి అక్రమ రవాణా దారుణాదారులపై త్వరలో జిల్లాకలెక్టర్,ఆర్.డి.ఓ, జిల్లాఎస్పీ లకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఫిర్యాదు తీసుకోవడం లేని అధికారులు..! లక్డారం గ్రామంలో మట్టి మాఫియా చెలరేగిపోతుంటే అధికారులు ఎందుకు స్పందించడం లేదో అర్థం కాని పరిస్థితి..,!వాల్టా చట్టపరిది రెవెన్యూ వ్యవస్థకు వస్తుంది..! మరి రెవెన్యూ అధికారులు స్పందించకపోవడంలో మర్మమేమిటో అర్థం కాదు..?ఇక్కడ అక్రమ మట్టి రవాణా చేస్తున్న అక్రమార్కులపై సంగారెడ్డి రూరల్,కంది,పటాన్చెరు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయి ఉన్నాయి. కొన్ని కేసులు విచారణ స్థాయిలో ఉన్నాయి..! మరి ఇంత తంతు జరుగుతున్నా అధికారులు స్పందించకపోవడంలో మర్మమేమిటో అర్థం కాదు..?ఇకనైనా అక్రమార్కులపై చర్యలు తీసుకొని వాల్టా చట్టాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.