Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

మంచం పట్టిన మాధవరాయని గూడెం

మాధవరాయినిగూడెంలో విషజ్వరాలు

– ఇంటింటికి జ్వర బాధితులే…

– కోదాడ-ఖమ్మం బాట పడుతున్న జ్వరపీడితులు

– జ్వర బాధితులకు తీవ్రమైన కీళ్ళ నొప్పులు

హుజూర్ నగర్–నిజం చెపుతాం న్యూస్:

హుజూర్ నగర్ మున్సిపల్ పరిధిలోని 28వ వార్డు మాధవరాయినిగూడెంలో గత జనవరి నెల నుండి వార్డు పరిధిలోని ప్రజలు ఒళ్ళు నొప్పులతో

కూడిన జ్వరాల భారినపడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు… మొదటగా మామూలుగా సీజనల్ గా వచ్చే జ్వరం అనుకుని స్థానిక బస్తీ దవఖాణాతో పాటు హుజూర్ నగర్ లోని ప్రభుత్వ

ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స చేయించుకున్నారు. జ్వరం తగ్గిన తరవాత కాళ్ళ నొప్పులు వచ్చి నడవలేని విధంగా మారడంతో మెరుగైన చికిత్స కోసం జ్వర పీడితులు, కీళ్ళ నొప్పుల

బాధితులు కోదాడ-ఖమ్మం- హైదరాబాద్ ప్రాంతాలకు వెళ్ళి వైద్యం చేయించుకున్నట్లు బాధితులు తెలిపారు. అప్పటి నుండి క్రమక్రమంగా 28వ వార్డు మాధవరాయినిగూడెం ప్రాంతం

మొత్తం ప్రతి ఇంట్లో జ్వరాలు వచ్చి ఒళ్ళు నొప్పులతో బాధపడుతుండంతో విషయం తెలుసుకున్న స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్, వైద్య సిబ్బంది అప్రమత్తమై

మాధవరాయినిగూడెంలో దోమల నివారణకు ఫాగింగ్ చేయించడంతో పాటు డ్రైనేజీలలో పూడిక తీయించి గ్రామం అంతా బ్లీచింగ్ చల్లించి పారిశుద్య చర్యులు చేపట్టారు. వైద్య శాఖ

ఆధ్వర్యంలో ఫిభ్రవరి 5న గ్రామంలో మెడికల్ క్యాంపు నిర్వహించి జ్వరంతో బాధపడుతున్న 45మందికి రక్త పరీక్షలు, వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమగు వారికి మందులు

అందజేసి ఇంకా మెరుగైన చికిత్స కోసం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ విషయమై గ్రామంలో ఉన్న బస్తీ దవఖాణా డా. వాణీ మాట్లాడుతూ…. గ్రామంలో విషజ్వరాలు వచ్చిన మాట

వాస్తవమని బాధితులందరికి రక్త పరీక్షలు నిర్వహించామని వారికి నిర్వహించిన పరీక్షలలో డెంగ్యూ, మలేరియా వంటి జ్వరాలు లేవని పారిశుద్య లోపం వలన, దోమల వలన జ్వర బారిన పడుతున్నారని తెలిపారు.

ఈ విషమం స్థానిక మున్సిపల్ అధికారులకు తెలిపామని ఇప్పటికే పారిశుద్య చర్యలు చేపట్టారన్నారు.గ్రామంలోకి ట్యాంక్ ద్వారా, మిషన్ భగీరథ ద్వారా వస్తున్న నీరు లికులు ఉన్న చోట కలుషితమయ్యే అవకాశం ఉందని దీనిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని మాధవరాయినిగూడెం ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని కోరుచున్నారు.