Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

అంతర్ రాష్ట్ర దొంగలను పట్టుకున్న మానుకోట టౌన్ పోలీసులు

  • ఏడు కేసుల్లో 12 తులాల బంగారం, 53 తులాల వెండి వస్తువులు, పల్సర్ బైక్ స్వాధీనం.
  • జే,చెన్నయ్య, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్.
    మహబూబాబాద్, క్రైమ్ రిపోర్ట్ ఫిబ్రవరి 8, (నిజం చెపుతాం): అంతరాష్ట్ర దొంగలను చాకచక్యంగా పట్టుకొని వారి వద్ద నుండి 12 తులాల బంగారం, 53 తులాల వెండి ఒక పల్సర్ బైకును స్వాధీనం చేసుకున్నామని జే, చెన్నయ్య, అడిషనల్ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ తెలిపారు. గురువారం మహబూబాబాద్ పోలీస్ స్టేషన్ లో ని కాన్ఫరెన్స్ హాల్లో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చెన్నయ్య మాట్లాడుతూ, పట్టణంలోని వివేకానంద సెంటర్ లో రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి, రమేష్ టౌన్ ఎస్ఐ, టి రామారావు, తమ సిబ్బందితో వాహనాలను చెకింగ్ చూస్తుండగా పల్సర్ బైక్ పై ఇద్దరు వ్యక్తులు అనుమానాస్ప దంగా వస్తున్నారు. వారిని ఆపి విచారించగా వారి వద్ద బండికి సంబంధించిన ఏలాంటి కాగితాలు లేవు. అనుమానాస్పదంగా ఉన్న వీరిని విచారించగా మీరు ఇరువురు కన్నా రేణుక తో కలిసి గత కొద్ది రోజులు నుండి కొత్తగూడెం, మహబూబాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలలో దొంగతనాలు చేసి వాటిని వరంగల్ లో అమ్ము కోవడానికి వెళుతున్నామని వారు తెలుపగా వారి వద్ద నుండి ఐదు కేసులకు సంబంధించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నామని రమేష్ తెలిపారు. నిందితుల యొక్క వివరాలను తెలుపుతూ, పొన్నాల శివశంకర్, తండ్రి వీరభద్రం, వయస్సు 42 సంవత్సరాలు, కులం, వీరముష్టి, వృత్తి, డ్రైవర్, సత్యనారాయణపురం, యానం బైలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఎడ్ల సుమన్, తండ్రి, సమ్మయ్య, 24 సంవత్సరాలు, కులం, మాల, వృత్తి, ఎలక్ట్రీషియన్, అనంతారం, మహబూబాబాద్, వీరిని విచారించగా పరారీలో ఉన్న మిగతా ఇద్దరు నిందితుల వివరాలను తెలుపుతూ, కన్నా రేణుక, దాసరి జంపయ్య ఉన్నారని అడిషనల్ ఎస్పీచెన్నయ్య తెలిపారు. తాము స్వాధీనం చేసుకున్న వస్తువుల విలువ సుమారు 5 లక్షల 60 వేల రూపాయలని తెలిపారు. వివరాల లోకి వెళితే భద్రాద్రి కొత్తగూడెం కు చెందిన శివశంకర్ చిన్నప్పటినుండి ఏమి చదువుకోకుండా కూలీ పనులు చేసుకుంటూ బ్రతికేవాడు. 2008 సంవత్సరంలో పెళ్లి అయిన నాలుగు సంవత్సరాల వరకు కాపురం చేసి భార్యను వదిలేశాడు. అప్పటినుండి తాగుడుకు చెడు అలవాట్లకు అలవాటు పడి జల్సాలు తీర్చుకోవడానికి పందిరి వెంకటేశ్వర్లు, ప్రశాంత్, రమేష్, తిరుపతిరావు, దాసరి జంపయ్య, శివకృష్ణతో కలిసి ఖమ్మం, కొత్తగూడెం, పాల్వంచ, హైదరాబాద్, నెల్లూరు ప్రాంతాలలో పలు దొంగతనాలు చేసినాడు. ఈ క్రమంలో కన్నా రేణుక, ఎడ్ల సంధ్యలు పరిచయం కాగా వారిద్దరితో ఒకరికి తెలువకుండా మరొకరితో కలిసి ఉండేవాడు. కన్నా రేణుకను తీసుకొని మహబూబాబాద్ కు వచ్చి బస్టాండ్ దగ్గర ఒక రూము కిరాయికి తీసుకొని ఉంటూ రామచంద్రాపురం కాలనీలో ఒక దొంగతనం చేసినాడు. తదుపరి రూమ్ ఖాళీ చేసి ఈదుల పూసపల్లిలో ఒక ఇల్లు కిరాయికి తీసుకొని అక్కడ రేణుకతో కలిసి ఇంటి ఎదురుగా ఉన్న ఇంటిలో దొంగతనం చేసినారు. అనంతరం మహబూబాబాద్ లోని నందన గార్డెన్ దగ్గరలోని గోపాలపురంలో ఒక ఇంటిలో దొంగతనం చేసి వాటిలో కొన్ని కేసముద్రంలోని ముత్తూట్ ఫైనాన్స్ లో కొన్ని, మహబూబాబాద్ ముత్తూట్ ఫైనాన్స్ లో కొన్ని బంగారం వస్తువులు కుదువ పెట్టి డబ్బులు తీసుకొని వారి ఖర్చులకు వాడుకున్నారు. ఈ క్రమంలో ఎడ్ల సంధ్య కు కడుపు వస్తే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. తరువాత హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఒక ఇంట్లో శివశంకర్ ఎడ్ల సంధ్య కు వరుసకు తమ్ముడైన ఎడ్ల సుమంత్ కలిసి ఒక దొంగతనం చేసినారు. అక్కడి నుండి కొత్తగూడెం వెళ్లి అక్కడ ఒక బండి దొంగతనం చేసి దానిపై రోజు దొంగిలించిన బంగారం వెండి వస్తువులు వరంగల్ లో అమ్ముటకు పోతుంటే పట్టుకోవడమైనదని చెన్నయ్య అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తెలిపారు. ఈ కేసులో నిందితులను చాకచక్యంగా పట్టుకున్న సీఐ రమేష్ కు టౌన్ ఎస్ఐ రామారావు కు వారి సిబ్బందికి రివార్డులతో అభినందించడమైనదని చెన్నయ్య తెలిపారు.