Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

రమాబాయి అంబేద్కర్

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 7, ( నిజం న్యూస్)

  • పేరు: రమాబాయి అంబెడ్కర్
  • జన్మదినం: ఫిబ్రవరి 7,1898
  • పరినిర్వాణం: మే 27-1935,

మా అమ్మ, మాతా రమాబాయి ప్రపంచ మేధావిని తీర్చిదిద్ది దేశానికే దీపమయ్యారు,
భారత దేశ చరిత్రలో అమ్మ రమాబాయి పేరు ఒక పేజీ ని పెట్టాల్సివస్తుంది,
బాబా సాహెబ్ ను గుర్తించినంతగా తన స్వంత జాతి ప్రజలు బాబా సాహెబ్ విజయాలకు కారణమైన
రామబాయిని గుర్తించలేదనే చెప్పాలి. తన త్యాగాల పునాదుల మీద బాబా సాహెబ్ ని ఒక మేను పర్వతం గా తాను నిలబెట్టింది. డాక్టర్ అంబేద్కర్ ఒకొక్క మెట్టు వెనుక రమాబాయి అమ్మ పంటి బిగువున బిగపట్టిన బాధ తాలూకు గాయలున్నాయి.
బాబా సాహెబ్ ఇదంతా గుర్తించారు. ఆమెకు గుర్తుగా 1941 ఆయన వ్రాసిన “థాట్స్ ఆన్ పాకిస్తాన్” పుస్తకాన్ని అంకిత మిచ్చారు. అతి తొందరగా “నా “అనుకునే వారిని పోగొట్టుకున్న రమాబాయి తో బాబా సాహెబ్ వివాహం 1906 లో బైకుల్లా మార్కెట్ లో జరిగింది అప్పుడు బాబా సాహెబ్ కి 14 ఏళ్ళు, రమాబాయి కి 9 ఏళ్ళు.అతి చిన్నవయసులోనే వివాహం జరగడం వలన రమాబాయి చదువు కు దూరం అయ్యింది.
బాబా సాహేబ్ తనకు చదువు చెప్పేంచాలని ప్రయత్నం చేయడం జరిగింది ,ఈ ప్రయత్నం లో ఆమె కొద్దిగా వార్త పత్రికల హెడ్ లైన్ లు చదవవలగడం నేర్చుకుంది.తన పెళ్లి తరువాత బాబా సాహెబ్ మెట్రిక్యులేషన్ పాస్ అయ్యారు.డాక్టర్ అంబెడ్కర్ కి ఎల్లవేళలా తోడుంటూ ఎన్నో కష్టాలను ఓర్చుకుంటూ జీవనం సాగించడం జరిగింది.ఉన్నత చదువులకు బరోడా రాజు ప్రోద్బలం తో బాబా సాహెబ్ లండన్ వెళ్లడం జరిగింది.ఆ సమయం లో ఇంటి బాధ్యతలు రమాబాయి ఒక్కరే నెరవేర్చుకున్నారు. బాబా సాహెబ్ ఉన్నత చదువులకోసం తాను ఎన్నో బాధలను అనుభవించింది. ఇల్లు గడవని స్థితిలో అమ్మ పిడకలు చేసి అమ్మేవారు ఆ డబ్బులతో ఇల్లు గడిచేలా చూడటమే కాకుండా అందులో కొంత డబ్బు డాక్టర్ అంబెడ్కర్ కి పంపించేవారు .ఆమె జీవిత కాలం కష్టమే ఈ రోజున రాజ్యాంగం ద్వారా హక్కులు అణగారిన వర్గాల ప్రజలు అనుభవిస్తున్నారు అనడం లో సందేహం లేదు.
ఈ విషయాలు స్వయంగా డాక్టర్ అంబెడ్కర్ గ 3 ఫిబ్రవరి 1928 న బహిష్కృత భారత్ పక్ష పత్రికలో తన సంపాదకీయం లో వ్రాయడం జరిగింది.
ఒకొక్కరుగా తన బిడ్డలు రాలి పోతున్నా
మొక్కవోని ధైర్యం
అమ్మ సొంతం ,ఎంతటి బాధనైన తన గుండెల్లోనే దాచుకుని బాబా సాహెబ్ కి ధైర్యాన్నీ నూరిపోసేవారు.ఈ దంపతుల కష్టాలు వింటే పగవాడికి కూడా ఇన్ని కష్టాలు రావద్దని కోరుకుంటాం ,1907 నుండి మొదలయిన బాబా సాహెబ్ చదువు ప్రస్థానం 1953 ఉస్మానియా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ తో ముగిసింది.ఇవి సాధించటానికి వాళ్ళు ఇద్దరూ కారణమే, ఈ ప్రతీ చదువు వెనుక అమ్మ రమాబాయి త్యాగo ఉంది.
బాబా సాహెబ్ లండన్ కి వెళ్తున్నపుడు రమాబాయి గర్భవతి గా ఉంది.డాక్టర్ అంబెడ్కర్ సమకాలికులు చాలా సుఖంగా బ్రతుకు తూoటే ఈ దంపతులు తమ రక్తం ను చమట గా మారుస్తూ,తమ కన్నీళ్లతో పీడిత వర్గాలకు భవిష్యత్ బాటలు ఐనారు.రమాబాయి అమ్మ యొక్క కుమారుడు ‘రమేష్’చనిపోయారు,’ గంగాదర్’చనిపోయారు,ఒక్కగానొక్క ఆడ కూతురు ‘ఇందు’చనిపోయారు,చివరివారు బాబా సాహెబ్ కి అత్యంత ఇష్టుడు చిన్నవాడు అయినా ‘రాజ్ రతన్’ కూడా చనిపోయాడు, యశ్వంత్ అంబేడ్కర్ ఒక్కరే మిగిలాడు. బాబా సాహెబ్ జీవితం అంటే పోరాటo ఆ పోరాటం లో తనతో పాటు రమాబాయి అమ్మకూడా తన వంతు పనిచేసింది. రమాబాయి కి చదువు విషయం లో బాబా సాహెబ్ ని చూసి గర్వపడేది. అసమాన ఆయన ప్రతిభను చూసి నివ్వెర పోయేది, సమానత్వం కోసం ఆయన పడుతున్న తపణకు చలించిపోయేది, ఇదంతా చేస్తూ ఆయన ఆరోగ్యo కాపాడుకోలేక పోతున్నారు అంటూ అనుక్షణం తపన పడేది.తన కొడుకు చనిపోయినప్పుడు బాబా సాహెబ్ చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితి చూస్తూ తన కొంగు ను చింపి కొడుకు శవం మీద కప్పి ,తమ పరిస్థితి ని ఎదుటివారికి చూపించకుండా జాగ్రత్త పడిన విషయం తెలిస్తే బాబా సాహెబ్ కోసం ఆమె పడిన ఆవేదన ఇట్టే అర్థం అవుతుంది.బాబా సాహెబ్ చదువులు,జ్ఞానం అమ్మ రమాబాయి భిక్ష.ఎవరు ఏమనుకున్నా ఇది నిజం. భావోద్వేగాల మాటలు అనుకునేల ఉన్నా తన తొమ్మిదేళ్ల వయసులో బాబాసాహెబ్ లోకి వచ్చి ముప్పయి ఏళ్ళు ఆయనతో ఉండి అత్యున్నత శిఖరాలు ఎదగడం లో అమ్మ పడిన కష్టo ,ఈ భూమి మీద ఎవరికి ఇప్పటికి రాలేదు అనిపిస్తుంది.రమాబాయి అమ్మ అంటే త్యాగo
రమాబాయి అమ్మ అంటే ఒక పోరాటం…చివరికి ఈ పోరాటం అలిసి జబ్బుపడి, చివరిగా 1935 లో విశ్వాంతరా లల్లో కలిసి పోయింది.అమ్మ రమాబాయి కి వందనాలు..