Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

హామీలను నిలబెట్టుకోలేని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు గమనిస్తున్నారు

  • రైతు బంధు అడిగిన వారిని మంత్రి కోమటిరెడ్డి చెప్పుతో కొడతానన్నడం సంస్కారమేనా.
  • శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టుల ను కేఆర్ఎంబీకి అప్పగించడం వల్ల నల్గొండకు తీవ్ర నష్టం.
  • రూ.2 లక్షల రైతు రుణమాఫీ, పింఛన్ల పెంపు ఏమైంది.
  • తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీ శ్రీరామరక్ష
  • పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చూపిద్దాం.
  • తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి

తుంగతుర్తి ప్రతినిధి ఫిబ్రవరి7( నిజం చెపుతాం)తుంగతుర్తి మండల కేంద్రంలోని సిరి పంక్షన్ హాల్లో భువనగిరి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ తుంగతుర్తి నియోజకవర్గ విస్తృత స్థాయి సన్నాహక సమావేశం తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంతకండ్ల జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ – కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను ప్రజలు గమనిస్తున్నారని,కృష్ణా జలాల పంపిణీని కె ఆర్ ఎం బి కి అప్పగించటం కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనమని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం మండల కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ అధ్యక్షతన కోదాడ నియోజకవర్గం బీ.ఆర్.ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కృష్ణా జలాలపై కేంద్రం పెతనంతో ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి, పాలమూరు జిల్లాలు సాగు, తాగునీరు కోసం కేంద్రం అనుమతి కోసం ఎదురు చూడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల కృష్ణ జలాల ట్రిబ్యునల్ వివాదం ప్రధాని మోడీ తీర్చడానికి 9 ఏళ్లకు పైగా పట్టిందన్నారు. నాడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి కృష్ణా జలాల విషయంలో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు తీర్చుకుంటాయని కేంద్రం తల దూర్చవద్దని కరాకండిగా మాట్లాడి పోరాడారని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా కరువుతో కొట్టుమిట్టాడుతుంటే ఒక్క తడి నీరు కోసం కెసిఆర్ కోదాడ నుండి నాగార్జునసాగర్ వరకు పాదయాత్ర చేశారని, కెసిఆర్ పోరాటానికి తలగ్గిన ప్రభుత్వం ఒక పంట నీరు విడుదల చేసిందని గుర్తు చేశారు. గత పది ఏళ్లలో సాగునీరు తాగునీరు తో పాటు నాణ్యమైన విద్యుత్ అందించామని తెలంగాణ రాష్ట్రానికి మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కష్టాలు తెస్తుందన్నారు. కెసిఆర్ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాలను నిర్వహిస్తున్నామన్నారు అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ పనితీరు బయటపడిందని విమర్శించారు. సాగునీటి విషయమై మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి స్పందించకపోవడం జిల్లా ప్రజలకు అన్యాయం చేసినట్లేనన్నారు రైతుబంధు పడటం లేదని అడిగిన వారిని చెప్పుతో కొడతానని మంత్రి కోమటిరెడ్డి అనడం అహంకారానికి నిదర్శనం అన్నారు జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి పై మంత్రి పోలీసులతో దౌర్జన్యం చేయించడం సరికాదన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కార్యకర్తలు నాయకులు అంతా కష్టపడితే నల్లగొండ పార్లమెంటు సీటు బారాస దేనిని అన్నారు. అధికారంలోకి రాగానే మాఫీ చేస్తామన్న రెండు లక్షల రుణమాఫీ పెంచుతామన్న పింఛన్లు హామీ ఏమైందని ప్రశ్నించారు. ఆరు నూరైనా నోరు ఆరైనా ఈ నెల 13న నల్గొండలో జరిగే బహిరంగ సభను విజయవంతం చేస్తామని అన్నారు

తెలంగాణ జాతిపిత కేసిఆర్ రండ కాదురా.. రేవంత్ రెడ్డి రండ, దొంగ

మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ఆగ్రహం

గడిచిన 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తాగునీరు త్రాగునీరు ప్రవేశపెట్టి గ్రామాల్లోని రైతుల పంటల సస్యశ్యామలం కావడానికి కృషి చేసిన జాతిపిత ముఖ్యమంత్రి కేసీఆర్ ని పట్టుకొని రండానడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తగదని రేవంత్ రెడ్డి పెద్ద దొంగ రండ అని విమర్శించారు.
కె ఆర్ ఎం బి గేములు పూర్తిగా అవగాహన లేని జిల్లా మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజెపి ప్రభుత్వానికి దాసోహం అవడం సిగ్గుచేటని అన్నారు. దీనితో రామనా రోజుల్లో ఐదు జిల్లాలలో పూర్తిస్థా ఎడారిగా మారనున్నట్లు తెలిపారు. నీలా హక్కుల కోసం ఈనెల 13న నల్గొండలో జరిగే బహిరంగ సభకు ప్రతి గ్రామం నుంచి స్వచ్ఛందంగా తరలిరావాలని కోరారు. ఎన్నికల ముందు రెండు లక్షల రుణమాఫీ చెప్పి, నేటి వరకు కూడా రుణమాఫీ చేయని దద్దమ్మ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న ఎంపీ ఎంపీటీసీ జెడ్పిటిసి సర్పంచ్లు ఎన్నికైన సరే తుంగతుర్తి నియోజకవర్గంలో టిఆర్ఎస్ జండా ఎగరవేయాలని, గులాబీ సైన్యం అంత సిద్ధంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో, జడ్పీ చైర్మన్లు గుజ్జ దీపికా యుగంధర్ రావు ఎలిమినేటి సందీప్ రెడ్డి , సీనియర్ రాజకీయ విశ్లేషకులు ఒంటెద్దు నరసింహ రెడ్డి యాదాద్రి జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణ రెడ్డి జిల్లా రైతుబంధు అధ్యక్షులు రజాక్ మండల పార్టీ అధ్యక్షులు, తాటికొండ సీతయ్య జడ్పిటిసి దావుల వీరప్రసాద్ ఎంపీపీ గుండా గాని కవితా రాములు గౌడ్ డి సి సి డైరెక్టర్ గుడిపాటి సైదులు వైస్ ఎంపీపీ శ్రీశైలం యాదవ్ చైర్మన్లు, ఎంపీటీసీ లు, రైతు బంధు సమితి కోఆర్డినటర్లు, గ్రామశాఖ అధ్యక్షులు, మాజీ సర్పంచ్లు, సోషల్ మీడియా సభ్యులు మరియు నియోజకవర్గ పార్టీ అగ్రశ్రేణి నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.