Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

మోసపూరిత కాల్స్ మెసేజ్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలి

పెన్ పహాడ్ ప్రతినిధి, ఫిబ్రవరి 7, (నిజం చెప్తాం) అనుమానిత వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్ మెసేజ్ లు, లింకుల, పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పెన్ పహాడ్ ఎస్ ఐ పెరిక రవీందర్ అన్నారు. మంగళవారం రాత్రి ధూపహాడ్ గ్రామంలో ప్రజలకు సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గడిచిన కొంతకాలం నుంచి సైబర్ నేరాలు పెరిగాయని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు సైబర్ నేరాలు. సోషల్ మీడియా. డ్రగ్స్. మత్తుమందులు. గంజాయి నిషేధంపై. అవగాహన కల్పించారు సెల్ ఫోన్ వలన కలిగే అనర్థాల గురించి విద్యార్థులు చెడు వ్యసనాల బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు . ప్రజలు వేసవికాలంలో విలువైన వస్తువులను ఇండ్లలో ఉంచుకోవద్దని వేసవిలో దొంగల బెడద ఎక్కువగా ఉంటుంది కనుక తగు జాగ్రత్తతో ప్రజలు ఉండాలని ఆయన సూచించారు. గుర్తుతెలియని వ్యక్తులు గ్రామాలలో తిరిగిన. పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని అన్నారు. గ్రామాలలో యువత పేకాట ఆడిన, రోడ్లపై మద్యం సేవించిన ప్రత్యేక నిఘ ఉందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పోలీస్ బృందం వారు పాల్గొన్నారు.