Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

మరోకొత్త వైరస్ వెలుగులోకి…

వైరస్ అనే పేరు వినగానే మన అందరికీ గుర్తొచ్చేది కరోనా వైరస్. ఈ కరోనా వైరస్ బారిన పడి ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్లాదిమంది ప్రజలు ప్రాణాలను విడిచారు. ఇది ఇలా ఉండగా…..

స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు ఒక సరికొత్త వైరస్ లాంటి తత్వాలు గల ఒబెలిస్క్స్ (Obelisks) ను కనుగొన్నారు. ఈ ఒబెలిస్క్స్ మానవుని నోరు మరియు ప్రేగు లో ఎక్కువ సంఖ్యలో ఉంటాయని తెలిపారు.

సూక్ష్మ జీవులైన ఒబెలిస్క్స్ ఒకటి లేదా రెండు జీన్స్ లను కలిగి ఉంటుంది మరియు ఇవి ఒక రాడ్ ఆకారంలోకి ఏర్పడతాయి.

వైరస్ అండ్ విరోయిడ్స్ తో పోలిస్తే ఈ ఒబెలిస్క్ భిన్నంగా ఉంటాయి.

వైరస్ అనేది RNA జీనోమ్ మరియు ప్రోటీన్ కోర్టు ను కలిగి ఉంటుంది, Virus ( genome+protein coat). ప్రోటీన్స్ తయారీ కొరకు జీనోమ మీద జీన్స్ కలిగి ఉంటాయి. వైరస్ లు పునరావృత్తం అవ్వటానికి హోస్ట్ (host) అవసరం.

Viroids (only genome) వైరాయిడ్స్ కేవలం జీనోమ్ మాత్రమే కలిగి ఉంటాయి, వీటికి ప్రోటీన్ కోర్టు అనేది ఉండదు.

Obelisks అనేవి వైరస్ లు మరియు విరాయిడ్స్ కి మధ్యంతరం లో చోటు చేసుకున్నాయి. ఇవి Viroids లాగా circular single-stranded RNA genome ను కలిగి, ప్రోటీన్ కోట్ ను లేకుండా ఉంటాయి. అలాగే virus లాగా genome మీద genes ను కలిగి ఉంటాయి.

ఇది ఇలా వుండగా… ఒబెలిక్స్ యొక్క పరిణామ మరియు పర్యావరణ ప్రాముఖ్యత తెలియదు. ఇవి పరసిటిక్ లాగా హాని కలిగించేవా…. లేకా… ఎలాంటి హానీ జరగకుండా మానవుని శరీరము కి అవసరయ్యే సూక్ష్మ జీవులా అని  తెలుసుకోవాల్సి ఉంది.