Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

జీవనజ్యోతి పాఠశాల వ్యవస్థాపకురాలు మదర్ ఎలిజిబెత్ కన్నూమూత

  • పలువురు సంతాపం
    ధర్మవరం ఫిబ్రవరి 06 (నిజం చెపుతాం) పట్టణంలో గత ఐదు దశాబ్దాలుగా వేలాదిమంది విద్యార్థులకు విద్యను అందించిన జీవన్ జ్యోతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ వ్యవస్థాపకురాలు మదర్ ఎలిజిబెత్ (94) మృతి చెందారు. వీరి మృతి పట్ల పలువురు సంతాపం తెలుపుతూ పార్టీవదేహానికి పూలమాలతో ఘనంగా నివాళులర్పించారు. పట్టణంలోని పేద కుటుంబాల పిల్లలకు అతి తక్కువ ఫీజుతో ఎంతోమందికి ఇంగ్లీష్ మీడియం విద్యను నేర్పించి, ఆ విద్యార్థులు ఐఏఎస్ ఐపీఎస్సీలుగా తీర్చిదిద్దిన ఘనత మదర్ ఎలిజిబెత్ కి దక్కిందీ. ధర్మవరం పట్టణంలో గల ప్రైవేట్ విద్యాసంస్థలన్నింటికీ మదర్ ఎలిజిబెత్ స్ఫూర్తి ప్రదాతగా ఎంతో మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది. వీరు చేసిన సేవలను పలువురు కొనియాడారు. ఎలిజిబెత్ మరణం పట్టణానికి తీరని లోటు. ఈ సందర్భంగా ప్రస్తుత జీవన్ జ్యోతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ అడ్మిషన్స్ రెవరెండ్ సిస్టర్ ఝాన్సీ, ఆర్ సి ఎం చర్చ్ రెవరెండ్ ఫాదర్ ఏసల జోసెఫ్, ఇతర గురువులు జీవన్ జ్యోతి సిస్టర్స్ బృందము, మటకన్యలు, క్రైస్తవ విశ్వాసులు, పాఠశాల అధ్యాపకులు, బోధనేతర బృందం ఎలిజిబెత్కు పూలు వేసి ఘనంగా నివాళులు అర్పిస్తూ, ఆమె పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ నివాళులర్పించారు. వేలాదిమంది వారి స్వగృహానికి చేరుకొని ఆమె మృతి పట్ల సంతాపం తెలుపుతూ కన్నీటి పర్యంతమయ్య రు.