Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

పార్లమెంట్ ఎన్నికలలో బిజెపికి పట్టం కట్టండి…

  • గావు చలో కార్యక్రమంలో దిశా నిర్దేశం చేసిన తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి

మహేశ్వరం, ఫిబ్రవరి 6 నిజం న్యూస్ ప్రతినిధి: రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో బిజెపికి పట్టం కట్టాలని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి అన్నారు. మంగళవారం గావు చలో కార్యక్రమంలో భాగంగా మహేశ్వరం మండల పరిధిలోని అమీర్పేట్ గ్రామంలో జరిగిన డ్వాక్రా మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పేదల కష్టసుఖాలను తెలిసిన ప్రధాని మోడీ పేదల కష్టసుఖాలలో పాలుపంచుకుంటూ భారతదేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరుస్తున్నారని ఆయన తెలిపారు. రైల్వేస్టేషన్లో చాయ్ అమ్ముకొని కష్టపడి చదువుకొని పైకి వచ్చిన కుటుంబం నరేంద్ర మోడీ కుటుంబమని ఆయన అన్నారు. భేటీ బచావో బేటి పడావో కార్యక్రమం ద్వారా ఆడపిల్లలపై వివక్ష చూపకుండా ఆయన ఎన్నో కార్యక్రమాలను తీసుకురావడం జరిగిందని అన్నారు. కట్టెల పొయ్యి మీద వంటలు చేస్తే అనేక రోగాలు వస్తాయని చెప్పి ఉజ్వల యోజన పథకం ద్వారా మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లను ఇచ్చిన ఘనత కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వానికే దక్కుతుందని ఆయన అన్నారు. ఆదివాసి మహిళను రాష్ట్రపతి పీఠం మీద కూర్చోబెట్టిన ఘనత నరేంద్ర మోడీ కే దక్కుతుందని ఆయన అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను కల్పించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. దేశ, రాష్ట్ర రాజకీయాలలో మహిళలు అన్ని రంగాలలో రాణించే విధంగా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు. ఆయుష్మాన్ భారత్ కింద రూ.5 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందించడం జరుగుతుందని అన్నారు. జన్ ధ న్ యోజన ద్వారా ప్రతి ఒక్కరికి బ్యాంకు ఖాతాలను ఇవ్వడం జరిగిందని అన్నారు. కేంద్రం ఇచ్చే డబ్బులతో ఉపాధి అవకాశాలు పెంపొందించుకోవాలని ఆయన సూచించారు. 81 కోట్ల మందికి ఉచితంగా రేషన్ బియ్యాన్ని అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులను అందజేయాలని ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షుడు బొక్క నరసింహారెడ్డి, బిజెపి పార్టీ మహేశ్వరం నియోజకవర్గం ఇంచార్జ్ అందెల శ్రీరాములు యాదవ్, రాష్ట్ర అధికార ప్రతినిధి టీ. వీరేందర్ గౌడ్, నాయకులు బసవ పాపయ్య గౌడ్, అనంతయ్య, మహిళా మోర్చా నాయకురాలు సునీత, సుదర్శన్ రెడ్డి, శంకర్ రెడ్డి, దేవేందర్ రెడ్డి బిజెపి మండల అధ్యక్షుడు మాధవాచారి బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు యదీశ్ సుదర్శన్ యాదవ్ కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి, నందీశ్వర్, సర్పంచులు బసవ శ్రీశైలం గౌడ్, బుగ్గని శంకర్, రఘుపతి గౌడ్ శ్రావణ్ వివిధ గ్రామాల బిజెపి నాయకులు పాల్గొన్నారు.