Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

తూర్పు గూడెంలో… అంతర్ రాష్ట్ర దొంగల దోపిడీ

*సినీ పక్కిలో ఏకకాలంలో ఏడు ఇండ్లలో చోరీ*

*సుమారు మూడు తులాల బంగారం నాలుగు కిలోల వెండి ₹45 వేలు నగదు దొంగిలించిన దొంగలు*

*దర్యాప్తు చేపట్టిన పోలీసులు*

తుంగతుర్తి ఫిబ్రవరి 6( నిజం చెపుతాం)

మండల పరిధిలోని తూర్పు గూడెం గ్రామంలో సోమవారం రాత్రి సినీ ఫక్కిలో ఒకేసారి ఏడు ఇళ్లలో జరిగిన దొంగతనాలతో గ్రామం ఉలిక్కిపడింది.

వివరాల్లోకి వెళితే తూర్పు గూడెం గ్రామంలో సోమవారం రాత్రి దొంగలు ఇళ్లలో చేరబడి దొంగతనం పాల్పడిన సంఘటన మంగళవారం ఉదయం వెలుగులోకి వచ్చింది.

గ్రామస్తులు విషయాన్ని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ ఏడుకొండలు ఆధ్వర్యంలో సంఘటన స్థలానికి చేరుకునే దర్యాప్తు చేపట్టారు.

సంకినేని రామచంద్రరావు ఇంట్లో తులం నర బంగారం, మూడు కేజీల వెండి, నగదు 20వేల రూపాయలు, గట్టు జగదాంబ ఇంట్లో 20 తులాల వెండి కడియాలు, ముత్యం కాంతమ్మ ఇంట్లో పావు తులం బంగారం,

30 తులాల వెండి, నగదు పదివేల రూపాయలు, గునిగంటి కమలమ్మ ఇంట్లో 22 తులాల వెండి పట్టా గొలుసులు నగదు 15వేల రూపాయలు, దొంగిలించగా హజారి జగ్గయ్య,సంకినేని వెంకటేశ్వరరావు, లింగంపల్లి కలమ్మ ఇండ్లలో దొంగతనాలు జరిగినట్లు తుంగతుర్తి ఎస్ఐ ఏడుకొండలు తెలుపుతూ

ఈ మేరకు గ్రామంలోని ఏడు ఇళ్లలో చొరబడి సుమారు మూడు తులాల బంగారం నాలుగు కేజీల వెండి ₹45000/- దొంగిలించినట్లు తెలిపారు.