Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

స్నేహితుల మధ్య ఘర్షణ.. ఒకరు మృతి

నిజామాబాద్ రూరల్ (నిజం చెబుతాం న్యూస్) ఫిబ్రవరి 05:-
స్నేహితుల మధ్య ఘర్షణలో ఒకరు మృతి చెందిన ఘటన నిజామాబాద్ లో ఆదివారం జరిగింది. పవన్ ను తన స్నేహితులు చందు, చిన్నులు మద్యం ఇప్పించామని అడిగారు. ఈ విషయంలో ముగ్గురి మధ్య మాట మాట పెరిగి పవన్ పై చిన్ను,చందులు దాడి చేశారు. ఇంటికి వెళ్లిన పవన్ పై చిన్ను, చిన్ను తల్లి రేణుక, చందు దాడికి దిగారు. పవన్ ను రేణుక కత్తితో పొడిచింది. చికిత్స పొందుతూ సోమవారం పవన్ మృతి చెందాడు. ముగ్గురు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.