Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

పెండింగ్ ఈ-చలాన్లపై గడువు పొడిగింపు

నిజామాబాద్ అర్బన్ (నిజం చెబుతాం న్యూస్) ఫిబ్రవరి 05:-ఈ-చలాన్లపై రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన రాయితీని ఫిబ్రవరి 15 వరకు పొడిగించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వాహనదారులు తమ వాహనాలపై పెండింగ్ ఈ చలాన్లను త్వరితగతిన చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 26-12-2023 నుంచి పెండింగ్ ఈ చలాన్లపై రాయితీ కల్పించింది. ఈ రాయితీని ఈనెల 15 వరకు పొడిగించారు. ఈ అవకాశాన్ని వాహనదారులు సద్వినియోగం చేసుకోవాలని పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ కోరారు.