Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

జీడిపల్లి ఉర్సు జాతరకు ఏర్పాట్లు

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం జీడిపల్లి గ్రామం ఫిబ్రవరి 5 ( నిజం చెపుతాం ):- కల్వకుర్తి మండల పరిధిలోని జీడిపల్లి గ్రామంలో ఈనెల ఫిబ్రవరి 6వ తేదీన ప్రారంభమై 8వ తేదీ వరకు ఘనంగా ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈనెల 6వ తేదీన మంగళవారం రోజున రాత్రి 10 గంటలకు ఖాజా బందే నవాజ్ దర్గాలో గంధం ఎక్కించబడును, పరిసర ప్రాంతాల నుండి మార్చాల,రాచాలపల్లి, వెంకటపూర్, ఎల్లికట్ట, జిడిపల్లీ, రేవల్లి, మాధారం, సిర్సవాడ,కుర్మిద్ద పలు గ్రామాల నుంచి గంధం (సందల్) దర్గాలో సమర్పిస్తారని నిర్వాహకులు ఖాజా జియవుద్దిన్,పాషా మైనొద్దిన్,తాజుద్దీన్, నజీరొద్దిన్, నసీరోద్దిన్,బషీరొద్దిన్,మహిముద్, జలీల్, మోయిన్ ఖాన్,బాబా తెలిపారు. తేదీ 7వ తేదీన బుధవారం రోజున ఫాతేహలు, కందూర్ల కార్యక్రమాలు,8 తేదీన గురువారం రోజున దివ్య ఖురాన్ పఠనము సమాప్తం కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు.