Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

విద్యుత్ మీటర్లకు మీ ఫోన్ కనెక్షన్ లింక్ చేసుకోండి.

నారాయణపేట, ఫిబ్రవరి 05 నిజం చెపుతాం :-విద్యుత్ వినియోగదారులకు టి.ఎస్.ఎస్.పి. డి.సి.ఎల్. వారు తెలియచేయునది ఏమనగా ఎలక్ట్రికల్ మీటర్ కు మీ ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవాలిసిందిగా నారాయణపేట ఏడి. నందకీషోర్ ఓ ప్రకటనలో కోరారు . మీ ఎలక్ట్రికల్ బిల్లు ఎప్పటికి అప్పుడు మీకు మెసేజ్ వస్తుంది. ఎప్పుడేనా ఎలక్ట్రికల్ ప్రాబ్లెమ్ వచ్చి పవర్ కట్ అయితే మీకు ముందుగా ఈ టైం నుండి ఈ టైం వరకు పవర్ కట్ ఉంటుందని మెసేజ్ వస్తుంది. ఊరు పేరు మరియు ఎలెక్ట్రిక్ విద్యుత్తు బిల్లు ఎంత వచ్చింది. మెసేజ్ వస్తుంది మరియు మీరు బిల్లు కడితే బిల్లు కట్టినట్టు మెసేజ్ వస్తుంది. దయచేసి విద్యుత్ వినియోగదారులు అందరు ఏ మీటర్ కు ఫోన్ నెంబర్ లింక్ లేదో ఆ మీటర్ కి మీ ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవాలిసిందిగా కోరుకుంటున్నాము. దీనికి సంబందించిన లింక్ ఇస్తున్నాము. https://tssouthernpower.com/updatemobilenumber