Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలి

నారాయణపేట , ఫిబ్రవరి 05 నిజం చేపుతాం :-

ప్రత్యేక అధికారుల పాలనలో మన జిల్లాలోని గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని జిల్లా అదనపు కలెక్టర్ మయాంక్ మిత్తల్ సూచించారు. గ్రామ పంచాయతీలలో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమైన నేపథ్యంలో నూతన పంచాయతీరాజ్ చట్టం, గ్రామపంచాయతీల నిర్వహణ, విధి – విధానాల వంటి అంశాలపై ప్రత్యేక అధికారులకు అవగాహన కల్పించేందుకు సోమవారం జిల్లా కేంద్రానికి సమీపంలోని సింగారం క్రాస్ రోడ్ వద్ద గల వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఈ వేసవి కాలంలో ఎట్టి పరిస్థితుల్లో తాగునీటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీ కార్యాచరణ అమలు చేయాలన్నారు.గ్రామాల్లో సర్పంచ్ లు పదవి కాలం ముగిసినందున మళ్ళీ పంచాయతీ ఎన్నికలు నిర్వహించే వరకు ప్రత్యేక అధికారులతో పాలన సాగించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామానికి ప్రత్యేక అధికారులను నియమించడం జరిగిందని, ప్రత్యేక అధికారులుగా నియమితులైన వారికి గ్రామంపై సంపూర్ణ బాధ్యత,హక్కులు ఉంటాయని, ప్రత్యేక అధికారులు నూతన పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన కల్పించుకొని, గ్రామ పంచాయతీ విధులను సమర్థవంతంగా నిర్వహించాలని, ప్రతి గ్రామ పంచాయతీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దే దిశగా కృషి చేయాలన్నారు. ఈ నెల 7 నుంచి ఫిబ్రవరి 15 వరకు ప్రతి గ్రామంలో ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ నిర్వహించాలని, ప్రజలను, యువతను, మహిళలను భాగస్వామ్యం చేస్తూ గ్రామాలను పరిశుభ్రంగా తయారు చేయాలని, ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ లో భాగంగా గ్రామాలలో మధ్యం, గంజాయి వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడితే వచ్చే నష్టాలపై అవగాహన సైతం కల్పించాలని, ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ చివరి రోజున గ్రామసభ నిర్వహించాలని, ఉత్తమ సేవలు అందించిన పారిశుద్ధ కార్మికులకు సన్మానించాలని అదనపు కలెక్టర్ మయాంక్ మిత్తల్ సూచించారు. ‌
ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ లో భాగంగా గ్రామంలోని ప్రభుత్వ కార్యాలయాలు, రోడ్లు శుభ్రం చేయాలని, పిచ్చి మొక్కలను తొలగించాలని, ఓవర్ హెడ్ ట్యాంకులను శుభ్రం చేసుకోవాలని, గ్రామంలో ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలందరిని భాగస్వా మూలను చేసి ప్లాస్టిక్ పై అవగాహన కల్పించాలన్నారు.
గ్రామాల్లో పచ్చదనం పెంపొందించేలా మొక్కల సంరక్షణకు ప్రాధాన్యత కల్పించాలని, అందుబాటులో ఉన్న ఆర్థిక సంఘం నిధులను సమర్ధవంతంగా వినియోగించుకుంటూ గ్రామాల్లో అవసరమైన పనులు చేపట్టాలని ఆయన పేర్కొన్నారు. వేసవి కాలంలో త్రాగునీటికి ఇబ్బందులు రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామంలో త్రాగునీటి కనెక్షన్లపై సర్వే నిర్వహించి, ఇంకా నల్లా కనెక్షన్ లేని ఇండ్లు గుర్తించాలని అన్నారు.
త్రాగునీటి సరఫరాకు సంబంధించి ఆర్థిక సంఘం నిధులను వినియోగించుకునే అవకాశం ఉందని,గ్రామలలో అంతర్గత నీటి సరఫరా, నూతన నల్ల కనెక్షన్ పనుల ప్రతిపాదనలు తయారు చేసి జల్ జీవన్ మీషిన్ ద్వారా నిధులు పొందాలని తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద మంజూరైన పనులు ఎన్నికల కంటే ముందే గ్రౌండ్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. గ్రామ పంచాయతీలో తప్పనిసరిగా పంచాయతీ కార్యదర్శి ఉండాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి మురళి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి గోపాల్ నాయక్, జడ్పీ డిప్యూటీ సీఈఓ జ్యోతి, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు..