Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

మహబూబాబాద్ లో భూ కబ్జాలపై కలెక్టర్ కు ఫిర్యాదు…

  • మెడికల్ కాలేజ్ చుట్టూ 50 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా
  • ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ చుట్టూ 20 ఎకరాల కబ్జా, ఇండ్ల నిర్మాణాలు
  • ప్రభుత్వ యూనివర్సిటీ పీజీ కాలేజ్ భూమి 7 ఎకరాలు కబ్జా
  • ఆర్తి గార్డెన్ పరిసర ప్రాంతాలలో 50 ఎకరాల కబ్జా
  • ప్రభుత్వ భూములను కాపాడాలి
  • యూనివర్సిటీ పీజీ కాలేజ్ కు 10 ఎకరాల భూమి కేటాయించాలి
  • బోడ రమేష్ నాయక్ జిల్లా అధ్యక్షులు లంబాడి హక్కుల పోరాట సమితి
    మహబూబాబాద్ స్టేట్ బ్యూరో శ్రీనివాస్ నాయక్ ఫిబ్రవరి 5 (నిజం న్యూస్) మహబూబాబాద్ కలెక్టర్ కార్యాలయం ప్రజావాణిలో లంబాడి హక్కుల పోరాట సమితి మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు బోడ రమేష్ నాయక్ పాల్గొని గత ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు వారి బినామీలు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములను కబ్జా చేసుకుని దర్జాగా సొమ్ము చేసుకుంటున్నారని కలెక్టర్ కు వివరించారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ చుట్టూ దాదాపుగా 10 ఎకరాల ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 551 లో కొంతమంది ఖాళీ భూములను కబ్జా చేసుకుని ఫెన్సింగ్ వేసుకొని ఉన్నారు ఈ భూమిలో లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిరుపేద ఇల్లు లేని లంబాడి కుటుంబాలకు ఇంటి నిర్మాణం కోసం 80 గజాల జాగా కోసం ఆ భూమిలో సేవాలాల్ తండా పేరుతో గుడిసెలు వేసుకుంటే అప్పటి తహసిల్దార్ ప్రభుత్వ భూమిలో ప్రవేశించినందుకు బైండ్ ఓవర్ కేసులు నమోదు చేయడం జరిగింది. కానీ అదే కబ్జా చేసుకున్న వ్యక్తి అదే ప్రభుత్వ భూమి చుట్టూ ఫెన్సింగ్ చేసుకుని దర్జాల బోర్డు పాతి మా లంబాడి హక్కుల పోరాట సమితి నాయకుల పైన పోలీస్ స్టేషన్ లో ప్రైవేట్ కేసు నమోదు చేపించడం జరిగింది. ఈ భూమి విషయంలో కబ్జా చేసిన వ్యక్తులు హైకోర్టు లో దావ వేసుకోగా హైకోర్టు వారు దావా వేసిన ప్రైవేటు వ్యక్తులకు సర్వేనెంబర్ 551 ప్రభుత్వ భూములలో అక్రమంగా ప్రవేశించి కబ్జా చేయకూడదని దీనిపై స్థానిక తహసిల్దారు గారు కబ్జా చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకొని ప్రభుత్వ భూములు కాపాడాలని రిట్ ఆర్డర్ లో పేర్కొనడం జరిగింది. అయినా రెవెన్యూ అధికారులు వారికి సహకరిస్తున్నారని అన్నారు. అదేవిధంగా మరికొంతమంది ప్రభుత్వ భూములలో ఇల్లు నిర్మాణాలు చేసుకుంటూ దర్జాగా అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. అదేవిధంగా సర్వేనెంబర్ 551 లో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ పేరు మీద గిరిజన లంబాడీ రైతుల నుండి దాదాపుగా 150 ఎకరాలు భూమి సేకరిస్తే అందులో దాదాపుగా 50 ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా చేసుకున్నారని, ఆ భూములకు సంబంధించి ఇప్పటివరకు గిరిజన లంబాడి రైతులకు ప్రభుత్వం నుండి ఎటువంటి నష్టపరిహారం రాలేదని అన్నారు. మెడికల్ కాలేజ్ పరిసర ప్రాంతాలలో ఉన్న ప్రభుత్వ భూమి సర్వేనెంబర్ 551 లో దాదాపుగా 50 ఎకరాలు దర్జాగా కబ్జా చేసుకుని అందులోనే దాదాపు 15 సంవత్సరాలుగా పరిసర ప్రాంతాలలో ఉన్న గుట్టలను తోలుచుకుంటూ క్రషర్ మిల్లులు నడుపుకుంటూ ఆదాయం సంపాదించుకుంటున్నారనీ అన్నారు. ఈ భూములను రెవెన్యూ అధికారులు రికార్డు తారుమారు చేసి శనిగపురం రెవిన్యూ శివారులో గల నెంబర్లను కేటాయించి పట్టాదారు పాసు పుస్తకాలను ఇవ్వడం జరిగిందని అన్నారు.అతిపెద్ద గిరిజన జిల్లా అయినటువంటి మహబూబాబాద్ లో విద్యాభివృద్ధి కొరకు ప్రభుత్వ యూనివర్సిటీ పీజీ కాలేజ్ ను మంజూరు చేసి దానిని ప్రభుత్వం డిగ్రీ కాలేజ్ లో నడిపిస్తుంటే యూనివర్సిటీ పీజీ కాలేజ్ కోసం 2018లో ప్రభుత్వం గుమ్మునూరు రెవిన్యూ పరిధిలో ఆర్తి గార్డెన్ పరిసర ప్రాంతంలో సర్వేనెంబర్ 287 లో 7 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయిస్తే అప్పటి ప్రజాప్రతినిధుల బినామీలు అప్పటి రెవిన్యూ అధికారుల అండదండలతోటి యూనివర్సిటీ పీజీ కాలేజ్ భూములను కబ్జా చేసుకుని దర్జాగా అమ్ముకుని ఇళ్ల నిర్మాణాలు చేసుకుంటున్నారు. ఆ ఇళ్ల నిర్మాణాలకు ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ వారు సహకరించి రోడ్లు పోయించడం జరిగింది, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు స్తంభాలు వేయించి కరెంటు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆర్తి గార్డెన్ పరిసర ప్రాంతాలలో దాదాపుగా 50 ఎకరాల ప్రభుత్వ భూమి సర్వేనెంబర్ 287 లో ఉన్న భూములను కబ్జా చేసుకుని ప్రజా ప్రతినిధుల బినామీ పేర్ల మీద పట్టాదారు పాసుపుస్తకాలు తీసుకుని రైతుబంధు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ కు వివరించారు అదేవిధంగా మరి కొంతమంది భూకబ్జాదారులు రెవిన్యూ అధికారులను ప్రలోభ పెట్టి ప్రభుత్వ భూములలో పెట్రోల్ బంకుల నిర్మాణాల కు పరిమిషన్లు పొంది దర్జాగా పెట్రోల్ బంకులు నడుపుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు.ఈ సమస్యల పైన గత ప్రభుత్వంలో చాలాసార్లు కలెక్టర్ కు దరఖాస్తులు చేసుకున్నా కూడా ఫలితం లేకపోయిందని కలెక్టర్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చూసి, ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకొని, వారికి కేటాయించిన పట్టాదారు పాసుపుస్తకాలు రద్దుచేసి, ప్రభుత్వ భూములు కాపాడాలని కోరారు. అదే విధంగా మహబూబాబాద్ జిల్లాలో విద్యాభివృద్ధి కొరకు ప్రస్తుతం యూనివర్సిటీ పీజీ కాలేజ్ బిల్డింగ్ లు లేక ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లో నడిపించడం చాలా ఇబ్బందిగా ఉన్నందున దయచేసి యూనివర్సిటీ పీజీ కాలేజ్ కోసం 10 ఎకరాల ప్రభుత్వ భూములను కేటాయించాలని కోరారు. ఈ విషయాల పైన జిల్లా కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి అతి త్వరలో ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారిని సహించేది లేదని వారిపై చర్యలు తీసుకొని ప్రభుత్వ భూమిని కాపాడుతామని హామీ ఇచ్చారని అన్నారు.