Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

మానుకోట భూ గోల్ మాల్ పై రేవంత్ రెడ్డి కన్నెర్ర

  • మహబూబాబాద్ ఎమ్మెల్యేకు తెలియకుండానే నివేదిక తెప్పియించుకున్న ముఖ్యమంత్రి
  • ఇద్దరు తహసీల్దార్ ల అరెస్టుకు రంగం సిద్ధం.
  • గత ప్రభుత్వంలో ప్రభుత్వ, ప్రైవేటు భూములను కబ్జాలు చేసి విక్రయించిన వారి వివరాలను వారికి సహకరించిన రెవెన్యూ అధికారుల వివరాలు తెలుసుకుంటున్నట్టు విశ్వసనీయ వర్గాల బోగట్ట.
  • తీగ లాగితే డొంకంతా కదులుతుందని ఆందోళన చెందుతున్న భూ ఆక్రమణదారులభయాందోళనలు.
  • – పలు సందర్భాలలో గత ప్రభుత్వంలో జరిగిన ప్రభుత్వ భూములను ఆక్రమించిన అమ్మిన ఒక్క గజం కూడా వదలకుండా తిరిగి స్వాధీనం చేసుకుంటామని ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ అన్నారు.
  • ఇక భూదాన్ భూముల విషయంలో భూముల దందా అంతా ఇంతా కాదు. దీనికి జిల్లాలోని కొందరు తహసీల్దారులు కారణ భూతులు.
    మహబూబాబాద్, జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 5,( నిజం న్యూస్):
    మహబూబాబాద్ జిల్లాలో భూదన్ భూములు మాయo.మాజీ తహసీల్దార్ రంజిత కుమార్ హస్తం.మహబూబాబాద్, బేతోల్, మాధపురం, మల్యాల భూదన్ భూములు మాయం.భూములు గోల్ మాల్ చేసి సన్మానం అందుకున్న తహసీల్దార్ అరెస్టుకు రంగం సిద్ధం.అప్పుడు ఉన్న రికార్డ్ లు పరిశీలన.అప్పటి జిల్లా కలెక్టర్ లపై నిఘా.ఆదర్శం మాటున కోట్లుదండుకున్నతహసీల్దార్కు.వత్తాసుపలికినమాజీజిల్లాకలెక్టర్.మహబూబాబాద్ రెవిన్యూ రికార్డ్ లు తారు మారు చేసిన ఇద్దరు తహసీల్దార్ లు. అక్రమంగా పాసు పుస్తకాలు పొందిన వారు జైలుకే. అక్రమదారులంతా అప్పటి అధికార బి. ఆర్. ఎస్ నాయకులు, కార్యకర్తలు. పట్టా భూమి ఒక ఎకరం కొని దాని పక్కన ఉన్న ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని లే అవుట్ లేకుండా ప్రభుత్వ భూమిని పట్టా భూమిగా మార్చి, ఇందుకు సహకరించిన రెవెన్యూ అధికారులకు లక్షలాది రూపాయలు కట్టబెడుతూ సంబంధిత ఎమ్మెల్యే, ఎంపీ సహాయ సహకారాలతో కోట్లాది రూపాయలు దండుకున్న భూభాకాసుల కు రోజులు దగ్గర పడ్డాయని కాంగ్రెస్లోని రెండవ శ్రేణి నాయకులు అనుకుంటున్నారు. ఈ విధంగా పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేట్ భూములు అయినా సరే, చెరువు కట్ట కింద ఉన్న భూములైన వాళ్లకు ఒక్కటే. అలాంటి భూములు ఎఫ్ టి ఎల్ లో ఉన్న, భూదాన్ భూములైన వారికి తేడా రాదు. ఈ భూమకాసురులకు కావలసిందిగా అక్రమంగా సంపాదించే డబ్బులు. అతి త్వరలో వీరి అక్రమాలకు అడ్డుకట్టపడే రోజులు దగ్గర ఉన్నాయని ప్రజలు అనుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన పట్టణంలోని కొన్ని ప్రభుత్వం భూములు, ప్రైవేట్ భూములకు సంబంధించిన పూర్తి సాక్షాధారణతో ” నిజo” పత్రిక వాస్తవాలను వెల్లడిస్తుంది. పట్టణంలోని పదికి పైగా ఉన్న చెరువులు, కుంటల క్రింద ఉన్న చెరువు శిఖం భూములు ఎంత ఉండేది?, ఈరోజు ఎంత భూములు ఉన్నాయి. ఎన్ని కుంటలు మాయమయ్యాయి కనీసం ఆనవాళ్లు లేకుండా భూ బకాసురులు రూపుమాపారు. ఫ్లాట్లు చేసి కోట్లాది రూపాయలు దండుకున్న స్థానిక నాయకుల భూ బాగోతాలు బయటపడనున్నాడని కొందరు కాంగ్రెస్ నాయకులు అనుకుంటున్నారు.