కడప ఎయిర్ పోర్ట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం..
టిప్పర్ ను ఢీ కొన్న సుమో, కారు..నలుగురు సజీవ దహనం..ముగ్గురికి తీవ్ర గాయాలు…ఎర్రచందనం తరలిస్తున్న సుమో టిప్పర్ ను ఢీ కొన్న సంఘటన వెంటనే మరో కారు కూడా ఢీ కొట్టడంతో ప్రమాదం..
కడప తాడిపత్రి రహదారి పై గోటూరు, తోళ్లగంగన్నపల్లె మద్యలో ప్రమాదం…
అర్థరాత్రి 3 గంటల సమయంలో జరిగిన ఘటన..
టిప్పర్ డీజల్ ట్యాంక్ ను సుమో ఢీ కొట్టడం తో మంటలు చెలరేగి సుమోలో ఉన్న నలుగురు ఎర్ర చందనం స్మగ్లర్లు సుమోలోనే సజీవ దహనం…
మంటలు ఆర్పిన ఫైర్ ఇంజిన్ లు..
మృతుల వివరాలు తెలియాల్సి ఉంది..
పోలీసుల సమాచార సేకరణలో ఉన్నారు..
స్మగ్లర్ లు తమిళనాడుకు చెందిన వారుగా గుర్తింపు..
ప్రమాదానికి కారణమైన మరో కారు కూడా స్మగ్లర్ల పైలట్ కారు గా గుర్తింపు..
క్షతగాత్రులు ముగ్గురు తమిళనాడుకు చెందిన వారే..
క్షతగాత్రులను రిమ్స్ ఆసుపత్రికి తరలించిన పోలీసులు..
క్షతగాత్రుల్లో ఇద్దరి పేర్లు ముని, మూర్తి…