Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

రెవెన్యూ శాఖలో బదిలీలు

ధర్మవరం ఫిబ్రవరి 04 (నిజం చెపుతాం) నియోజకవర్గమైన ధర్మవరంలో రెవెన్యూ శాఖలో బదిలీలు వేగవంతంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గతంలో ఉన్నటువంటి ఆర్డిఓ తిప్పే నాయక్ను కడప జిల్లాకు బదిలీ కాగా, వారి స్థానంలో పులివెందుల నుండి రమేష్ రెడ్డిని ధర్మవరం ఆర్టీవో గా బదిలీ చేశారు. కానీ రమేష్ రెడ్డి మూడు నెలలు విధులు నిర్వర్తిస్తుండగానే ఎన్నికల అధికారులు సీసీఎల్ఏ విజయవాడలో రిపోర్ట్ చేసుకోవాలని ఉత్తర్వులు అందాయి. తదుపరి గుంటూరు జిల్లా పిడి డ్రామాగా విధులు నిర్వహిస్తున్న వెంకట శివారెడ్డిని ధర్మవరం ఆర్డీవో గా గత రెండు రోజుల కిందట ఉత్తర్వులను జారీ చేశారు. అదేవిధంగా తహసిల్దార్ కార్యాలయంలో గతంలో ఉన్న యుగేశ్వరీ దేవిని కొన్ని ఆరోపణలతో కలెక్టర్ సస్పెండ్ చేయగా, వారి స్థానంలో ఇంచార్జ్ తహసిల్దారుగా ఈశ్వరయ్య కొనసాగుతున్నారు. తదుపరి చిత్తూరు జిల్లా ఒంటిమిట్ట నుండి రమేష్ బాబు ను ధర్మవరం తాసిల్దారుగా నియమిస్తున్నట్లు ఎన్నికల అధికారులు ఉత్తర్వులను జారీ చేశారు. మొత్తం మీద ధర్మవరం నియోజకవర్గంలోని ధర్మవరం,బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ మండలాలలో రెవెన్యూ శాఖలోని అధికారులను రాబోయే ఎన్నికల దృష్ట్యా బదిలీలుగా చేయడం జరిగింది. మొత్తం మీద ఎన్నికల సంఘం రాష్ట్రవ్యాప్తంగా రాబోయే శాసనసభ ఎన్నికలను సజావుగా, పారదర్శకంగా జరిపేందుకు చర్యలు తీసుకొన్నది..