Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఆదోని టిడిపి ఎమ్మెల్యే టికెట్టు మైనారిటీలకే దక్కే అవకాశం ఉందా?

ఆదోని ఫిబ్రవరి 04(నిజం న్యూస్) తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి
కర్నూలు జిల్లాలో ఇంతవరకు ఒక్కనియోజకవర్గంలో మైనారిటీలకూ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన దాఖలాలు లేవనే చెప్పవచ్చును.
కాని మారుతున్న రాజకీయ సమీకరణాల దృష్ట్యా, వైకాపా ప్రభుత్వం రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయటం, బిజెపికి వైసిపి పార్టీ కట్టు బానిసగా మారడం ఇత్యాది విషయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముస్లిం మైనారిటీలు టిడిపి వైపు చూసేలా చేస్తున్నాయి. ఇదే జరిగితే ముస్లిం ఓట్లు గుంపగుత్తగా టిడిపికి పడే అవకాశాలు పుష్కలంగా వున్నాయని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. కాని ఇందుకోసం టిడిపి ముస్లిం మైనారిటీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయ పడుతున్నారు.
ఇందుకోసం టిడిపి ఎలాంటి అడుగులు వేస్తుందో చూడాలి. రాష్ట్రంలో
మరో పక్క ముస్లిం మైనారిటీలు అత్యధికంగా ఉన్న రాయలసీమ ప్రాంతంలో వైకాపా బలంగా ఉంది. కొన్ని చోట్ల సరైన పావులు కదిపితే రాయలసీమ లో సైతం టిడిపి సంచలన విజయాలు సాధించగలదని ఎన్నికల విశ్లేషకులు ( సెఫాలజిస్టులు) తేల్చి చెబుతున్నారు.
జిల్లాలోముఖ్యంగా ఆదోని నియోజకవర్గంలో సరైన ముస్లిం మైనారిటీ వ్యక్తికి టిడిపి పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినట్లయితే ప్రభుత్వ వ్యతిరేకత,వైకాపా ఎమ్మెల్యే, నాయకుల పై ఆగ్రహం తో ఉన్న ప్రజల ఓట్లు,టిడిపి ఓటు బ్యాంకుకు ముస్లిం మైనారిటీ ఓట్లు తోడైతే రాయలసీమ లోనే రికార్డు స్థాయిలో ఆదోనిలో టిడిపి గెలిచే అవకాశం కనిపిస్తోందని సర్వేలు తెలియజేస్తున్నాయి. పైగా ఆదోని నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీ అభ్యర్థి నిలబడితే ఆదోనితో పాటు చుట్టుపక్కల 4 నియోజకవర్గాలైన ఆలూరు, మంత్రాలయం, ఎమ్మిగనూరు మరియు పత్తికొండ నియోజకవర్గాల ప్రజలు కూడా టిడిపి వైపు సానుభూతి చూపి ఓట్లు వేసే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని చెప్పవచ్చు. తద్వారా వైసిపికి కంచుకోటలా ఉన్న ఆదోని, పత్తికొండ డివిజన్ల వైసిపి రాజకీయ ప్రాబల్యం టిడిపి వైపు తరలే అవకాశాలే ఎక్కువ.
ఆదోని టికెట్ ప్రకటించే విషయంలో టిడిపి అధినాయకత్వం తాత్సారం చేయటం వెనుక మైనారిటీలకు టికెట్ కేటాయించాలని పార్టీ ఆలోచిస్తున్నదనే వార్తలు వినవస్తున్నాయి. ఏది ఏమైనా బిసిలకు రాజ్యాధికారం కల్పించిన టిడిపి మైనారిటీలకు కూడా తగు ప్రాధాన్యత ఇస్తే ఇక ఆంధ్ర రాష్ట్రంలో టిడిపికి ఓట్ల సునామీయే.