Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

తుంగతుర్తి నియోజవర్గం ప్రెస్ ఇన్చార్జి గా లక్ష్మయ్య ఎంపిక పట్ల హర్షం

తుంగతుర్తి ప్రతినిధి ఫిబ్రవరి 4 (నిజం చెపుతాం) న్యూస్

కాంగ్రెస్ పార్టీ నుండి ప్రెస్ ఇన్చార్జిగా మండల కేంద్రం చెందిన కందుకూరిలక్ష్మయ్య కు బాధ్యతలు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు నియమిoచారు.

ఈ సందర్భంగా లక్ష్మయ్య విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే మందుల సామేలు సంబంధించిన ప్రతి కార్యక్రమం తుంగతుర్తి నియోజకవర్గం లోని అన్ని మండలాల ప్రెస్ మిత్రులకు అందజేస్తమని, ఎమ్మెల్యే తన మీద పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తామని చెప్పారు.

ఈ నియామకం పట్ల తుంగతుర్తి మండల జర్నలిస్టులు , శ్రేయోభిలాషులు, ఉద్యమకారులు అభినందనలు తెలుపుతూ, హర్షం వ్యక్తం చేశారు