Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

లక్డారం గ్రామంలో సంతోష్ సాండ్ అండ్ గ్రానైట్ సప్లయర్స్ క్వారీ సీజ్

పటాన్ చెరు ఫిబ్రవరి 3 (నిజం చెపుతాం) సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు లక్డారం గ్రామంలో నిర్వహింపబడుతున్న క్వారీలలో సంతోష్ సాండ్ అండ్ గ్రానైట్ సప్లయర్స్ సంస్థ క్వారీనీ శనివారం అధికారులు సీజ్ చేశారు.లక్డారం క్రషర్ల భాగోతంపై ఫిర్యాదుల మేరకు మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ టాస్క్ ఫోర్స్ కమిటీని వేసి విచారణ చేపట్టారు.కమిటీ ఏర్పడిన ఏడు రోజుల్లోనే సంతోష్ సాండ్ అండ్ గ్రానైట్ సప్లయర్ సంస్థ క్వారీనీ అధికారులు సీజ్ చేశారు.ఈ సంస్థ యాజమాన్యం మైనింగ్ నిబంధనలను నామమాత్రం కూడా పాటించడం లేదని కాలుష్య నియంత్రణ శాఖ నిబంధనలు ఉల్లంఘించారని క్వారీనీ సీజ్ చేశారు.ఈ సందర్భంగా ఆ.ర్డీ.వో రవీందర్ రెడ్డి మాట్లాడుతూ లక్డారం గ్రామ పరిధిలోని 37 క్రషర్ల యాజమాన్యాలు మైనింగ్ నిబంధనలను పాటించడం లేదని అన్నారు.టాస్క్ ఫోర్స్ కమిటీ పూర్తి నివేదిక రెండు రోజుల్లో రానుందని నివేదిక ఆధారంగా నిబంధనలు ఉల్లంఘించిన యాజమాన్యాలపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. యాజమాన్యాలు మైనింగ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు.ఈ సందర్భంగా ఆయనతోపాటు మైనింగ్ ఏ.డి మధుకుమార్, కాలుష్య నియంత్రణ శాఖ ఈ.ఈ గీత,ఏ.ఈ శ్రవణ్,తాసిల్దార్ భాస్కర్,సీఐ ప్రవీణ్ రెడ్డి, ఆర్.ఐ కాజా పాల్గొన్నారు.

  • కొండను తొవ్వారు.. ఎలుకను పట్టారు..!
  • సంవత్సరం వరకు కళ్ళు మూసుకున్న అధికారులు..?

అయితే సంతోష్ సాండ్ అండ్ గ్రానైట్ సప్లయర్స్ యాజమాన్యం కాలుష్య నియంత్రణ శాఖ నిబంధనలను నామమాత్రంగా నైనా పాటించడం లేదని విచారించిన కేంద్ర కాలుష్య అధికారులు గత సంవత్సరం 10/03/2023 నాడు ఈ క్వారీని సీజ్ చేయాలని ఆదేశించారు.అయితే సంతోష్ సాండ్ అండ్ గ్రానైట్ సప్లయర్స్ యాజమాన్యం నిర్లక్ష్యంగా ప్రభుత్వ ఆదేశాలను బేకతార్ చేస్తూ ఎదేచ్ఛగా తమ సంస్థను నిర్వహిస్తుంటే కాలుష్య నియంత్రణ శాఖ అధికారులు కళ్ళు మూసుకున్నారా అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నెలకోసారి తనిఖీలు చేయాల్సిన అధికారులు సీజింగ్ సమాచారాన్ని జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారుల దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదో అర్థం కాని ప్రశ్న..?అయితే సంతోష్ సాండ్ అండ్ గ్రానైట్ సంస్థ రాయల్టీ కట్టకుండానే క్వారీనీ నిర్వహించారా..?అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సంవత్సరం పాటు అనుమతులు లేకుండా తమ సంస్థ నిర్వహించారంటే ప్రభుత్వానికి వందల కోట్ల లూటీ చేశారా..?అన్న అనుమానాలు ఉన్నాయి.అధికారులు విచారణ అని అన్నారు..! సర్వేలు అని అన్నారు..!తీరా గత సంవత్సరం ఇచ్చిన తీర్పును ఇప్పుడు అమలు చేశాం అంటున్నారు..! దీన్నిబట్టి అధికారుల తీరు కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉంది అంటూ గ్రామస్తులు విమర్శిస్తున్నారు..!