Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

వాహనదారుల ప్రాణాలు కాపాడటమే మా లక్ష్యం

  • మేడ్చల్ డిటివో కిషన్ ,ఉప్పల్ ఆర్టీవో రవీందర్ కుమార్,

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 3, ( నిజం న్యూస్) జనవరి 15వ తేదీ నుంచి ఫిబ్రవరి 14వ తేదీ వరకు జరుగుతున్న రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా పేట్ బషీరాబాద్ లోని మేడ్చల్ డిటివో కార్యాలయంలో రోడ్డు భద్రత పై ఆర్టీవో అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డిటివో కిషన్, ఉప్పల్ ఆర్టీవో రవీందర్ కుమార్ లు వాహనదారులకు రోడ్డు భద్రత పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… రోడ్డు సేఫ్టీ గురించి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తెలుసుకొని బాధ్యత కలిగి ఉండాలన్నారు. దేశంలో ప్రతి నిమిషానికి ఒక రోడ్డు ప్రమాదం జరుగుతుండగా, ప్రతి మూడు నిమిషాలకు అదే రోడ్డు ప్రమాదంలో ఒకరు మృత్యువాత పడుతున్నారని తెలిపారు. ఎక్కువ శాతం అధిక వేగంతో రోడ్డుపై వాహనాలను నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం జరుగుతుందని వాపోయారు. రోడ్డుపై వాహనాలు నడిపే ప్రతి ఒక్క వ్యక్తి రూల్స్ ను పాటించి ఇతరులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా వాహనాలను నడపాలని సూచించారు. మద్యం మత్తులో వాహనాలు నడపకూడదని, ముఖ్యంగా ఫోర్ వీలర్ వాహనాలకు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని కోరారు. ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతీ ఒక్కరు హెల్మెట్ తప్పనిసరిగా వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంవీఐలు జి.రవి కుమార్ , ప్రతాప్ రాజా , బి.అమృత వర్శిని, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్, రామకృష్ణ, ఇఫ్తేకార్ తదితరులు పాల్గొన్నారు.