Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

మహబూబాబాద్ ఎంపీ సీటు బరిలో బానోతు విజయ బాయి

స్టేట్ బ్యూరో ఫిబ్రవరి 3 (నిజం న్యూస్) హైదరాబాద్ గాంధీభవన్లో మహబూబాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా దరఖాస్తు చేసుకున్న బానోతు విజయభాయి తదనంతరం ఆమె మాట్లాడుతూ : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రధాన అనుచరాలిగా మహబూబాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా తనకు అవకాశం ఇవ్వాలని, ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించాలని 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడుతూ.ఏఐసిసి పీసీసీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమం విజయవంతం చేయడంలో మహిళలను ముందంజలో ఉంచడంలో కీలక పాత్ర పోషించానని ఆమె అన్నారు. మహబూబాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా పార్టీ అధిష్టానం నాకు అవకాశం ఇస్తే అత్యధిక మెజార్టీతో గెలిచి చూపిస్తానని ఆమె విజ్ఞప్తి చేశారు..
2018 లో వైరా ఎమ్మెల్యేగా కాంగ్రెస్ సిపిఐ సిపిఎం తెలుగుదేశం ( మహా కూటమి) తరపున పోటీ చేసి స్వల్ప ఓటమితో ఓడిపోయారు. అప్పటినుండి కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ప్రతి పనిలోనూ ముందుండి ప్రజల పక్షాన పోరాడుతూనే ఉన్నారు. మహబూబాబాద్ ప్రజలకు ప్రజా సేవ చేయాలనే సంకల్పం తో ఎంపీ బరిలో దిగారు. విజయ్ బాయ్ కి సంఘీభావం తెలపడానికి ర్యాలీగా తండ ధర్మారం యూత్ : గురు చరణ్, రామ్ సింగ్, నరేష్ ,శ్రీనివాస్ ,నవీన్, రామ్ నాయక్, తదితరులు గాంధీభవన్ కి వెళ్లి విజయ భాయ్ కి గెలుపుకి సహకరిస్తామని చెప్పారు.