Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

డీసీఎం ఢీకొని టీచర్ మృతి…

మహేశ్వరం ఫిబ్రవరి 2 నిజం న్యూస్ ప్రతినిధి: డీసీఎం ఢీకొని ఒక గవర్నమెంట్ టీచర్ మృతి చెందిన సంఘటన మహేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలో బిటిఆర్ మ్యాక్స్ ప్రాజెక్టు వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. మహేశ్వరం ఎస్ఐ రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. కందుకూరు నుండి హైదరాబాదుకు మాధవరం వెంకట్ రావు గవర్నమెంట్ టీచర్ తన కారు మీద ప్రయాణిస్తుండగా ఎదురుగా వస్తున్న డీసీఎం ఢీకొనడంతో ఆయన అక్కడికి అక్కడే మృతి చెందాడు. అతని వయసు 49 సంవత్సరాలు నివాసం తెల్కపల్లి గ్రామం నాగర్ కర్నూల్ జిల్లా వాస్తవ్యులు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.