Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

గొర్రెల దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తులు రిమాండ్…

మహేశ్వరం ఫిబ్రవరి 2 నిజం న్యూస్ ప్రతినిధి: గొర్రెల దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు మహేశ్వరం సిఐ వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు.  చిన్న తూప్రా గ్రామం వద్ద వాహనాలు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఈ ముగ్గురు దొంగలను పట్టుకున్నామని ఆయన వెల్లడించారు. వీరి వద్ద నుండి మూడు కార్లు ఒక లక్ష యాభై వేల రూపాయలను సీజ్ చేయడం జరిగిందని ఆయన తెలిపారు. వీరు గతంలో మాణిక్యమ్మ గూడ, దిలావర్ గూడ, అమీర్పేట్ లలో దొంగతనాలకు పాల్పడ్డారని ఆయన వివరించారు. డేగవత్ ప్రభాకర్ నాయక్, శివకుమార్, శంకర్ వారి నివాసం గాజులయతండా, కనుమనురు విలేజ్, మరికల్ మండలం, నారాయణపేట జిల్లాకు సంబంధించిన వారుగా గుర్తించామని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్సైలు క్రైమ్ సిబ్బంది పాల్గొన్నారు.