Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఆయన వెంటే మేముంటాం..

టిఆర్ఎస్ పార్టీ నుండి. కాంగ్రెస్ పార్టీ తీర్థం….

చర్ల ఫిబ్రవరి 2 ( నిజం న్యూస్) టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రైతు సమన్వయ కమిటీ మండల కోఆర్డినేటర్ కొసరాజు కుమార్ రాజా బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు .

జనబల నాయకుడు కావడంతో సుమారు 1500 మంది కార్యకర్తలతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పు కోనున్నారు

గత 2014 భద్రాచలం నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశారు పది సంవత్సరాలు పార్టీలో పని చేస్తూ ప్రజల మనిషిగా మంచి పేరు సంపాదించారు

పంచాయతీ ఎన్నికల్లోను ఎంపీటీసీ ఎన్నికల్లోను సత్తా చాటి ప్రత్యర్థులకు డిపాజిట్లు రాకుండా టిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకున్నారు

2023 భద్రాచలం అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తెల్లం వెంకట్రావు గెలుపుకు ఎనలేని కృషి తనకంటూ స్థానాన్ని దక్కించుకున్నారు.

పేద ప్రజల కష్టాలు తెలుసుకుని వారిని ఆదుకున్న నాయకుడిగా గుర్తింపు ఉన్న బలమైన నాయకుడు లాంటి నాయకుడు ఆ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరితే బిఆర్ఎస్ పార్టీకి తేగడ సెంక్మెంట్ లో భారీ నష్టం జరిగే అవకాశాలు లేకపోలేదు.

ఆయన వెంటే మేము సైతం అంటూ ఏకకంఠంతో యూత్ నాయకులు మహిళా నాయకులు. కార్యకర్తలు చెపుతున్నారు . ఇకపై సెగ్మెంట్ లో కాంగ్రెస్. పార్టీ జెండా ఎగిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

యూత్ నాయకులు కుప్పాల నిరంజన్ మాజీ ఎంపిటిసి ఆలం ఈశ్వర్. ఎంపీటీసీ శోభారాణి మాజీ సర్పంచ్ అలవాల పార్వతి. వన్నాల క్రాంతి కుమార్ తదితరులు ఉన్నారు