Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఇసుక పాయింటు ఏర్పాటుకు కలెక్టర్ ఉత్తర్వులు

  • జగిత్యాలలో ఇసుక స్టాక్ పాయింట్ ఏర్పాటు..

జగిత్యాల ,ఫిబ్రవరి 2 (నిజం చెపుతాం) జిల్లాలో ఇసుక స్టాక్ పాయింట్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ కు లేఖ.. అక్రమ ఇసుక రవాణాను అరికట్టి, నిర్మాణ రంగం పై అదనపు ఆర్థిక భారం తగ్గించాలని విజ్ఞప్తి. ఇసుక స్టాక్ పాయింట్ ఏర్పాటుకు కలెక్టర్ ఆదేశాలు జారీ. నిర్మాణ రంగంలో ఇసుక ప్రాధాన్యతను వివరిస్తూ, ఇసుకను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు జిల్లా కేంద్రంలో ఇసుక స్టాక్ పాయింట్ ఏర్పాటు చేయాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి జగిత్యాల జిల్లా కలెక్టర్ యాష్మీన్ భాషా కు లేఖ రాశారు. గతంలో నిర్వహించిన ఇసుక స్టాక్ పాయింట్ ను ఏడాది కాలంగా నిలిపివేయడంతో భవన నిర్మాణ రంగానికి అవసరమైన ఇసుక అందుబాటులో లేకపోవడంతో ప్రైవేట్ గా ఇసుక కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొందని, దీంతో భవన నిర్మాణాలు చేపట్టే వారిపై అదనపు ఆర్థిక భారం పడుతుందని లేఖలో వివరించారు. ఇసుక స్టాక్ పాయింట్ ను తిరిగి ప్రారంభిస్తే, ఇసుక అక్రమ రవాణా నిలువరించడంతోపాటు, నిర్మాణ రంగానికి ప్రభుత్వపరంగా ఇసుక అందుబాటులోకి వస్తుందని తద్వారా నిర్మాణరంగంపై పడే అదనపు ఆర్థిక భారం కూడా తగ్గే..