Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

అక్రమ ఇసుక రావణ పక్క రాష్ట్రాలకు తరలింపు

  • ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొడుతున్న అక్రమ ఇసుక బక్కసారులు

(కామారెడ్డి ) : జుక్కల్ నియోజక వర్గం డోంగ్లి మండల ప్రాంతంలోని కుర్ల మంజిరా నది నుండి ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. బులేరో , ట్రా క్టర్ల ద్వారా ఇతర రాష్ట్రలు మహారాష్ట్ర , కర్ణాటక ప్రాంతాలకు పెద్ద ఎత్తున ఇసుక తరలి పోతోంది. ఇంత జరుగుతున్నా రెవెన్యూ, మైనింగ్‌, పోలీ సు అధికారులు కన్నెత్తి కూడా చూడటం లేదు. నిబం ధనలకు పాతర వేస్తూ వాగులు, వంకలను అడ్డాగా చేసుకొని తవ్వకాలు జరుపుతున్నారు.ఆయాప్రాంతాల నాయకులు ఇసుక అక్రమ రవాణా ద్వారా ఇప్పటికే లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకొని అధికారులకు మామూళ్లు ముట్ట జెప్పడంతో నాయకులు ఆడిందే ఆట, పాడిందే పాట గా కొనసాగుతుంది. వాగులలో ఇసుక అక్రమ రవా ణా వల్ల భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. యం త్రాలను ఏర్పాటు చేసి విచ్చలవిడిగా ఇసుకను తోడిస్తుండడంతో భూగర్భ జలమట్టం గణనీయంగా పడిపోతుంది. గతంలో వాగులలో నీటిజాలు పుష్కలంగా ఉండగా ప్రస్తుతం జాడ కనిపిం చడంలేదు.ఇసుకాసురులు రెచ్చిపోతున్న ఇటు రెవెన్యూ, అటు మైనింగ్‌, పోలీసు అధికారులు కన్నెత్తి చూడటం లేదు. ఉన్నతాధికారులకు అజ్ఞాత వ్యక్తులు సమాచారం అందించే సమయంలో మాత్రం హడావుడి చేసి తరు వాత అక్కడ ఏమీ జరగలేదన్నట్లు మిన్నకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇసుక క్వారీయింగ్‌ చేయాలంటే ప్రభుత్వ అనుమతి అవసమైతే అలాంటిదేమీ లేకుండానే అక్రమార్కులు పోలీసు, రెవెన్యూ , మైనింగ్‌ అధికారుల సహకారంతో ఇసుక అక్రమ రవానా జోరుగా సాగిస్తూ లక్షల రూపాయలు వెనుకేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల చేతివాటం ప్రదర్శిస్తుడడంతో ఇసు కాసురుల పని మూడు పువ్వులు.. ఆరుకాయలుగా ఉం ది. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు.