Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

లింగ నిర్ధారిత వీర్యం ద్వారా మొదటి ఆడ దూడ జననం

*•పరిశీలించిన జిల్లా పశువైద్యాధికారి కృష్ణ*

రాజపేట,ఫిబ్రవరి 2(నిజంచెపుతాం)

లింగ నిర్ధారిత వీర్యం ద్వారా వేగంగా పశుసంతతిని అభివృద్ధి చేసే కార్యక్రమం లో భాగంగా శుక్రవారం రాజాపేట మండలం బసంతాపురం గ్రామంలో మొదటి ఆడ దూడ జన్మించింది.

పశు వైద్యాధికారి చంద్రారెడ్డి వివరాలు చెప్పారు. గత సంవత్సరం మే నెలలో జిల్లా పశుగణాభివృద్ధి సంఘం ద్వారా ప్రభుత్వపరంగా కృత్రిమ గర్వాధారణలో లింగ నిర్ధారిత వీర్యం పాడి రైతుల పాడి పశువులకు అందుబాటులోకి తెచ్చి శ్రద్ధ ఉన్న పాడి రైతుల పశువులకు ఇప్పించడం జరిగిందన్నారు

ప్రభుత్వం ద్వారా టీఎస్ యల్, డి ఎ డి ఎల్ డి ఏ ద్వారా సబ్సిడీ ఫై ఇట్టి వీర్యం అందుబాటులోకి తెచ్చి వాడి పశువుల సంఖ్యను వేగంగా అభివృద్ధి చేయుటకు సంకల్పించినట్లు చెప్పారు

475 రూపాయల బదులు 250 రూపాయలకు రైతులకు అందుబాటులో తెచ్చినట్లు చెప్పారు. టీఎస్ఎల్డీఏ ద్వారా 4246 లింగ నిర్ధారిత వీర్యం డోసులు ఇప్పటివరకు అందించినట్లు తెలిపారు

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 874 డోసులు కృత్రిమ గర్భాధారణ ద్వారా ఇచ్చినట్లు ఇందులో 489 డోసులు యాదాద్రి జిల్లాలో ఇప్పించినట్లు చెప్పారు. జన్మించిన మొదటి దూడను పరిశీలించినట్లు తెలిపారు

పాడి రైతులకు ప్రదర్శించినట్లు చెప్పారు రైతులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా పశువైద్య అధికారి వీ. కృష్ణ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు

జిల్లా పశుగణాభివృద్ధి సంఘం కార్యనిర్వాహణ అధికారి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఇట్టి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని రైతులను కోరారు.

ముఖ్య కార్యనిర్వాణాధికారి డాక్టర్ మంజువాణి అభినందనలు తెలిపారు

ఈ కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి చంద్రారెడ్డి భాస్కర్ కార్యక్రమాల్ని నిర్వహించారు.

రైతులు మధుసూదన్ రెడ్డి, ప్రశాంత్, ఉపేందర్, మహిపాల