Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

మంత్రి వేణు సారూ… కాస్త మీరైనా…పట్టించుకోండయ్యా..

రాజమహేంద్రవరం రూరల్ పిబ్రవరి 1 (నిజం న్యూస్) కడియం.. ప్రమాదకర గుంత, పైగా ప్రధాన రహదారి రోజులు, నెలలు, సంవత్సరాలు గతించి పోతున్నా పట్టించుకునే నాధుడు కరువయ్యాడు. ధవళేశ్వరం నుండి సామర్లకోట వెళ్ళు ప్రధాన రహదారి (కెనాల్ రోడ్డు )లో వేమగిరి జాతీయ రహదారి కూడలికి కూత వేటు దూరంలో పెద్ద గుంతఏర్పడి ప్రమాదాలకు నిలయం గా మారింది. తరచూ పలు ప్రమాదాలు జరుగుతున్నా ప్రయాణికులు కాళ్ళు చేతులు విరుగుతున్నా, తలలు పగులుతున్నా ప్రజాప్రతినిధులు గానీ ప్రభుత్వ అధికారులు గానీ పట్టించుకున్న పాపానపోలేదు. గతంలో ఒక ద్విచక్ర వాహన దారుడు ఈ గుంతలో పడి తలకు తీవ్ర గాయమై ఘటనా స్థలం లోనే మృతి చెందినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. అప్పట్లోనే అప్పటి రూరల్ వైసీపీ కో ఆర్డినేటర్ చందన నాగేశ్వర్ తన స్వీయ నిధులు వెచ్చించి తాత్కాలిక మరమ్మతులు చేపట్టినట్లు స్థానికులు తెలియజేస్తున్నారు. ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతున్నా స్థానిక ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కనీసం స్పందించని ప్రజాప్రతినిధులు తీరును పలువురు తప్పుపడుతున్నారు. మంత్రి వేణు సారైనా కనీసం కనికరించి ప్రమాదకర గుంతలను శాశ్వతంగా పూడ్చే ఏర్పాట్లు చేయాలని, ప్రయాణికులను ప్రమాదల బారి న పడకుండా కాపాడాలని ప్రజల లంతా మంత్రి వేణు సార్ ని వేడుకుంటున్నారు.