Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి

  • ఎస్పీ జానకి షర్మిల

ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో, (నిజం చెపుతాం) ఆపరేషన్ స్మైల్ 10 ముగింపు సందర్భంగా జిల్లా ఎస్పీ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆపరేషన్ స్మైల్ 10 కార్యక్రమం జనవరి 1 నుండి 31 వరకు జిల్లాలో నిర్వహించడం జరిగింది. జిల్లాలో ఈ నెల రోజులలో 69 మంది బాల కార్మికులను పట్టుకోవడం జరిగింది. అందులో 62 మంది బాలురు, 07 మంది బాలికలు కలరు. నిర్మల్ డివిజన్ పరిధిలో మొత్తం 43 మంది, భైంసా డివిజన్ పరిధిలో మొత్తం 26 మంది ఉన్నారు. బాల కార్మికుల యజమానులకు, బాల కార్మికుల తల్లిదండ్రులను పిలిపించి వారికి కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. జిల్లాలో 18 సంవత్సరాల లోపు పిల్లలు బాలకార్మికులుగా పని చేస్తున్న వ్యవసాయ పనుల్లో ఉన్న, పశువుల కాపరులుగా, కిరాణం షాప్ లలో, మెకానిక్ షాపులలో, హోటళ్లలో కార్మికులుగా పనిచేస్తూన్న, రోడ్డుపై భిక్షాటన చేస్తున్న, ఇటుక బట్టీలలో, పౌల్ట్రీ ఫామ్ లలో, మరే ఇతర ప్రదేశాలలో ఉన్న తప్పిపోయిన/వదిలివేయబడిన, పిల్లలు బాలకార్మికులుగా పని చేస్తున్న పిల్లలు ఉన్నట్లయితే అలాంటి వారిని, తల్లిదండ్రులు తమ తాత్కాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పిల్లల భవిష్యత్తును నాశనం చేయరాదని సూచించారు. పిల్లలు వారి బంగారు భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని బడికి పంపించాలని, తల్లిదండ్రులు అయిన సరే తమ పిల్లలను బడి మాన్పించి పనులకు ఉపయోగిస్తే అది నేరంగా పరిగణించబడుతుందని అట్టి వారి పై కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఎస్పీ అన్నారు. జిల్లాలో బాలకార్మికులు లేకుండా ప్రజలందరూ సమిష్టిగా కృషి చేయాలని తెలిపారు. చిన్నపిల్లలు వెట్టిచాకిరికి గురికాకుండా వారిలో చిరునవ్వులు చిందించేలా ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలని, జిల్లాలో ఎవరైనా బాలకార్మికులను పనిలో పెట్టుకున్న, శారీరకంగా మానసిక మరియు లైంగిక దోపిడికి గురవుతున్న బాలలను చూసినప్పుడు, ఆర్థికంగా దోపిడీకి గురవుతున్న బాలకార్మికులను చూసినప్పుడు, హింసకు బెదిరింపులకు గురవుతున్న వీధి బాలలను చూసినప్పుడు, సంబంధిత పోలీసు అధికారులకు మరియు 1098 లేదా డయల్ 100,ఫోన్ చేసి సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని అన్నారు. బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి ఆపరేషన్ స్మైల్-10 బృందంలో పని చేసిన పోలీసు అధికారులు మరియు సిబ్బందిని, వివిధ డిపార్ట్మెంట్ అధికారులను జిల్లా ఎస్పీ అభినందనలు తెలుపుతూ ప్రకటన విడుదల చేశారు.