Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

రేషన్‌ షాపులకు నోటిఫికేషన్‌ విడుదల

చండూరు (నిజం): చండూరు రెవిన్యూ డివిజన్‌ పరిధిలోని మండలాలకు సంబంధించిన రేషన్‌ షాపులకు నూతన డీలర్ల నియామకం కోసం గురువారం ఆర్డీవో దామోదర్‌ రావు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. డివిజన్‌ పరిధిలోని 21 రేషన్‌ షాపులకు రిజర్వేషన్లను కేటాయించారు. దరఖాస్తుదారులు నేటి నుండి ఈనెల 8వ తారీకు సాయంత్రం ఐదు గంటల లోపు స్థానిక ఆర్డిఓ కార్యాలయంలో 250 రూపాయల తో దరఖాస్తు చేసుకోవాలని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. రిజర్వేషన్లు వివరాలు ఇలా… మునుగోడు మండలంలో చొల్లేడు, చల్మెడ, బీరెల్లిగూడెం జనరల్‌ కేటాయించగా, లక్ష్మీదేవిగూడెం బీసీ, రావి గూడెం బీసీ ఏ ఉమెన్‌, గుండ్లోరిగూడెం ఎస్సీ ఉమెన్‌, గంగోరిగూడెం జనరల్‌ ఉమెన్‌
చండూరు మండలం శిర్థేపల్లి, ఉడుతలపల్లి బిసి ఉమెన్‌, జోగిగూడెం, చండూరు-1 బిసి, చండూరు-2 జనరల్‌ ఉమెన్‌, నాంపల్లి మండలంలో నర్సింలగూడెం, పస్నూరు జనరల్‌, నాంపల్లి బిసి ఉమెన్‌, తుమ్మలపల్లి ఎస్సీ ఉమెన్‌, మల్లపురాజుపల్లి ఎస్సీ మరిగూడ మండలంలో కుదాభక్షుపల్లి బిసి, మరిగూడ జనరల్‌, శివన్నగూడెం ఎస్సీ గట్టుప్పల మండలం శేరిగూడెం జనరల్‌కు కెటాయించినట్లు తెలిపారు. దరఖాస్తుదారులకు ఈ నెల 15వ తారీఖున అర్హత పరీక్ష నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. 10వ తరగతి అర్హత కలిగి ఉండాలన్నారు.